
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని కథానాయకుడు మంచు విష్ణు చెప్పారు.ఆయన కీలక పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ మూవీ కన్నప్ప.
ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే “శివుడు ఆగ్రానికి ,శాపానికి గురవుతారు గుర్తుపెట్టుకోండి 100% కచ్చితంగా చెబుతున్నా ట్రోల్ చేస్తే ఇక ఫినిష్ అన్నారు” ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతుంది.
మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం న్యూజిలాండ్ 9,000 ఎకరాల ఫాంను ఆరు నెలలు అద్దె తీసుకున్నట్లు తెలిపారు.
ఇదే ప్రదేశంలో షూటింగ్ చేస్తుండగానే నాకు డ్రోన్ తగిలి బలమైన గాయమైందని చెప్పారు. షూటింగ్లో వాళ్ళందరూ కంగారు పడుతుంటే తనకు గాయమైన విషయం తన తండ్రి మంచు మోహన్ బాబుకి చెప్పకూడదని నేనే చెప్పాను. తర్వాత ఆస్పత్రికి వెళ్ళినట్లు చెప్పారు. కన్నప్పలో పోషించిన రుద్ర పాత్రలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారు .
మా నాన్న మోహన్ బాబు పై ఉన్న ప్రేమ ,గౌరవంతోనే ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు ,అక్షయ్ కుమార్ గారు, శరత్ కుమార్ గారు, తదితరులు నా చిత్రంలో నటించారు అని తెలిపారు.
నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప
కు దర్శకత్వం వహిస్తున్నారు .ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది.