
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పిఎస్ లో నటి శ్యామల గారు విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు మూడున్నర గంటలపాటు శ్యామల గారిని విచారించారు పంజాగుట్ట పోలీసులు. విచారణ అనంతరం శ్యామల మాట్లాడారు, ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను అని చెప్పారు. ప్రమోషన్ చేయడం తప్పని, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేదని చెప్పారు. చట్టాలపై నమ్మకం ఉందని పోలీసుల విచారణకు ఎల్లవేళలా సహకరిస్తానని చెప్పారు నటి శ్యామల.
ఈ కేసులో ఇప్పటివరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, రీతూ చౌదరి, విష్ణుప్రియ వీళ్ళందర్నీ పోలీసులు విచారించారు. విష్ణు ప్రియ .రీతు చౌదరి ఈనెల 25న మరోసారి ఎంక్వయిరీ కి రానున్నారు. వీరితోపాటు సన్నీ యాదవ్, అజయ్, సుదీర్ ఎప్పుడైనా విచారణకు హాజరై అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇంకా పోలీసులకు అందుబాటులో రాలేదని సమాచారం.ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు భావిస్తున్నారు.