
నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతయిన కార్మికులను బయటకు తీసేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మృతదేహం లభించగా మరో ఏడుగురి ఆచూకీ కోసం చూడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే టన్నల్ ప్రమాద ఘటనలో ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల లోపే అందులో చిరుకున్నవారు చనిపోయినట్లు తెలుస్తుంది.
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట మండలం వద్ద ఎస్ ఎల్ బి సి సొరంగం కూలి ఎనిమిది మంది గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 22న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో 40 మంది కార్మికుల పనిచేస్తుండగా స్వరంగం పైకప్పు కూలిపోయింది. అందులో 32 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా మరో ఎనిమిది మంది మాత్రం లోపటనే చిక్కుకుపోయారు. చిక్కుకున్న వారిలో టన్నెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మాత్రమే లభించింది. మరో ఏడుగురి పరిస్థితి ఇంతవరకు తెలవకుండా ఉన్నది. అధికారులు సహాయక బృందాలు ఎంతో ప్రయత్నం చేస్తున్న వారి ఆచూకీ మాత్రం కనబడడం లేదు.
టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూటివ్న్లో గత నెల రోజుల తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. దాదాపు ఒక వెయ్యి మంది కార్మికులు మూడు టీములుగా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు.
సొరంగం మొత్తం పొడవు 14 కిలోమీటర్లు ఉన్నది అందులో 13.85 కిలోమీటర్ల దగ్గర టన్నెల్ పై కప్పు కూలిపోయింది. బురద వల్ల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు.వారిని బయటికి తీయడం చాలా అసాధ్యమని అంటున్నారు.