
ఐసిఐసి ఛాంపియన్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలవడం అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ ఆతిథ్యంలో ఈ టోర్నీ జరిగింది. కానీ ఛాంపియన్ ట్రోఫీ నిర్వాహణలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి భారీ నష్టాలు వచ్చాయని చాలా కథనాలు వచ్చాయి. అయితే తమకు లాభాలు వచ్చాయని తాజాగా పిసిపి బోర్డ్ వెల్లడించింది. దాదాపు పది మిలియన్ డాలర్లు అంటే 280కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపింది. లాహోరు, కరాచీ రావలపిండి, స్టేడియాల ఆధునికరణ చేసేందుకు పెద్ద మొత్తం ఖర్చు చేయడంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అవాస్తమని చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రతినిధి అమీర్ మీర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు ఆదాయం విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మీడియాకు చెప్పారు.
టోర్నమెంట్ నిర్వాహనకు సంబంధించి అన్ని ఖర్చులను ఐసిసి భరించింది. టికెట్లు అమ్మకాలు మరియు అడ్వర్టైజర్స్ ద్వారా పిసిబికి ఆదాయం వచ్చింది.ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి మాకు అదనంగా 92 కోట్లు వస్తాయని భావిస్తున్నాం. మేము అనుకున్న లక్ష్యాలు ఇప్పటికే సాధించాం. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా అనుకున్న దానికంటే భారీగానే ఆదాయం మాకు వచ్చింది. ప్రభుత్వానికి టాక్స్ రూపంలో ఒక కోటి 20 లక్షలు చెల్లించాం. పిసిబి ప్రపంచంలోనే మూడో ధనవంతమైన బోర్డుగా మారనుంది.కేవలం నాలుగు నెలల్లోని స్టేడియాలలో రెనోవేషణ్ చేసాం. త్వరలోనే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం ఇక్కడ ప్రతి విషయం పారదర్శంగానే ఉంటుంది అని చెప్పారు.