
ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
పలు దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, చైనాకు మాత్రం టారిఫ్ రేటును ఏకంగా 125%కి పెంచారు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా మరింత ఘాటుగా మాట్లాడారు.
“ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా చూపుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అమెరికా చైనాపై విధిస్తున్న టారిఫ్‌ను ఏకంగా 125%కి పెంచారు . ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ” అని ఆయన పేర్కొన్నారు
ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.
S&P 500 సూచిక దాదాపు 7% పెరిగింది. అయితే, చైనా మినహా ఇతర దేశాలపై టారిఫ్ తగ్గింపుల గురించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా చెప్పా లేదు.
.
ఇంతకుముందు ట్రంప్ చేసిన టారిఫ్ పెంపుదల లో , “75కి పైగా దేశాలు అమెరికాతో చర్చలు జరపడానికి సంప్రదించాయి. ఈ దేశాలు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు.
కావున వారికి 90 రోజుల విరామం ఇవ్వడానికి మరియు 10% తగ్గిన పరస్పర టారిఫ్‌ను అమలు చేయడానికి అనుమతి ఇచ్చం.” అని తెలిపారు.
ఈ 10% టారిఫ్ పోయిన శనివారం నుండి కొత్తగా అమల్లోకి వచ్చింది. ఇది యూరోపియన్ యూనియన్‌పై ఉన్న 20%, జపాన్‌పై ఉన్న 24% మరియు దక్షిణ కొరియాపై ఉన్న 25% టారిఫ్‌లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, గతంలో అమెరికా విధించిన టారిఫ్‌లతో పోలిస్తే ఇది పెరుగుదలే.
ట్రంప్ చర్యలకు ప్రతిగా చైనా బుధవారం అమెరికా సరుకులపై 84% టారిఫ్‌లు పెంచింది.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల(USA And China ) మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా ఈ చర్యలు ఉన్నాయి.
ట్రంప్ విధించిన “Reciprocal” టారిఫ్‌లు అదే రోజు అమల్లోకి వచ్చాయి, వీటిలో చైనా తీవ్రంగా నష్టపోయింది.
కెనడా కూడా అమెరికా విధించిన 25% ఆటో టారిఫ్‌లను అనుసరించింది.
అమెరికా స్టీల్ మరియు అల్యూమినియంపై 25% టారిఫ్‌లు విధించడంతో యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా సరుకులపై కొత్త పన్నులు విధించింది.
అమెరికా మరింత టారిఫ్‌లకు పాల్పడితే “మేము చివరి వరకు పోరాడతాం” అని చైనా ఇదివరకే చెప్పడం జరిగింది.
మధ్యరాత్రి నుంచే ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి:
చైనాపై 104%, యూరోప్‌పై 20%, జపాన్‌పై 24% మరియు దక్షిణ కొరియాపై 25%. చర్చల ద్వారా ఈ రేట్లు తగ్గవచ్చని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది జరగడానికి నెలల సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు.