
ఉత్తర ప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్ గారి జీవితంపై ఒక సినిమా రానుంది అది “అజేయ్: ది అంటోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగీ”. ఈ చిత్రంShantanu Gupta’s రచించిన “The Monk Who Became Chief Minister”*పుస్తకంపై ఆధారపడి ఉంటుంది. మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు.
మోషన్ పోస్టర్‌లో, యోగి ఆదిత్యనాథ్ గా నటుడు అనంత్ జోషీ బ్యాక్ గ్రౌండ్ లో పరేష్ రావల్ కంఠస్వరం “వాడు ఏమీ కోరుకోలేదు, కానీ ప్రజలు అతన్ని కోరుకున్నారు. జనత అతన్ని నాయకునిగా తీర్చిదిద్దింది” అనే మాటలు వినిపిస్తాయి.
“Maharani 2” ఫేమ్ దర్శకుడు Ravindra Gautam, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దినేష్ లాల్ యాదవ్, అజయ్ మెంగి, పవన్ మల్హోత్రా, రాజేష్ ఖత్తర్, గరిమా విక్రాంత్ సింగ్, సర్వర్ అహుజా వంటి నటులు నటిస్తున్నారు.
చిత్రం పేరు యోగి ఆదిత్యనాథ్ యొక్క జన్మ నామం “అజయ్ సింగ్ బిష్ట్” నుండి ప్రేరణ పొందింది. 2025లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాకు Meet Bros సంగీతం అందిస్తున్నారు. Dilip Bachchan Jha మరియు Priyank Dubey స్క్రీన్ ప్లే, Vishnu Rao సినిమాటోగ్రఫీ, Uday Prakash ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.
దర్శకుడు రవీంద్ర గౌతం మాట్లాడుతూ : “మన దేశ యువతకు ఈ చిత్రం చాలా ప్రేరణనిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న గ్రామంలోని సాధారణ మధ్యతరగతి బాలుడు, భారతదేశంలోనే అత్యధిక జనాబా కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు యోగి ఆదిత్యనాథ్ యొక్క సాహసయాత్రను ఇందులో చూపిస్తాం. అతని ప్రయాణం దృఢనిశ్చయం, నిస్వార్థత, విశ్వాసం మరియు నాయకత్వం గురించి మరియు అతని అద్భుతమైన జీవితానికి న్యాయం చేసేలా ఈ చిత్రాన్ని తీశాము.”
రితు మెంగి “సామ్రాట్ సినిమాటిక్స్” బ్యానర్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.