రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి రాజకీయంగా తిరుగులేదు, శాసన సభ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా స్ధానిక సంస్ధల ఎన్నికలు అయినా వారి కుటుంబం లేదా వారు బలపరిచిన అభ్యర్దులు విజయం సాధిస్తారు. కాని ఫస్ట్ టైమ్ వైయస్ కుటుంబానికి ఇక్కడ ఓటమి దెబ్బ తగిలింది.
ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది.
40 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి మూటకట్టుకుంది. అసలు వైసీపీ ఊహించని విజయంగా ఇది నమోదు అయింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి భార్య 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ తరపున నిలబడిన హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా పొందలేకపోయారు.
ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 8103 ఓట్లు పోల్ అయ్యాయి, టీడీపీ అభ్యర్ది మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి.వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ఇద్దరికి చాలా గట్టి పోటీ ఉంటుంది అని భావిస్తే, కేవలం 10 శాతం కూడా ప్రభావం చూపించలేకపోయింది వైసీపీ. ఈ ఘన విజయంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయి అని కూటమి నేతలు కామెంట్లు చేస్తున్నారు..30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీ పీఠం టీడీపీ వశమైంది. గత చరిత్ర చూసుకుంటే 2016 ముందు వైయస్ కుటుంబం నిలబెట్టిన వారు ఐదు సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ ఎన్నో జరిగాయి ఫైనల్ గా టీడీపీ తన సత్తా చాటింది ఇక్కడ.