ఇది స్మార్ట్ యుగం. టెక్నాలజీ రోజులు..ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లే ఉంటున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు పేలుతున్నాయి అనే వార్తలు వింటూ ఉన్నాము. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఛార్జ్ పెట్టి ఫోన్లు మాట్లాడటం లేదా తలదిండు దగ్గర ఫోన్లు పెట్టుకున్న సమయంలో, ఫుల్ చార్జ్ అయి ఆ ఫోన్ పేలడం వంటి సంఘటనలు చూస్తున్నాం.
అయితే పూర్తిగా ఛార్జ్ ఎక్కిన తర్వాత కూడా సాకెట్ నుంచి తీయకపోవడం వల్ల మేజర్ గా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.. స్మార్ట్ ఫోన్లు చార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్.. మరి అవి ఏమిటో తెలుసుకుందాం.
మనం ఫోన్ ఛార్జ్ చేసే సమయంలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా పెద్ద ప్రమాదం జరగవచ్చు.. ఇక వర్షాకాలం ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వానలో ఏమైనా తడిస్తే, అది మనం పెద్దగా పట్టించుకోకుండా ఛార్జిగ్ పెడతాం, ఈ సమయంలో కరెంట్ పాస్ అయి అది పేలే అవకాశం ఉంటుంది.
అంతేకాదు ఫోన్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు మదర్ బోర్డ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే వర్షంలో నుంచి ఇంటికి వస్తే కచ్చితంగా ఫోన్ ని పొడి వస్త్రంలో తుడిచి 20 నిమిషాల తర్వాత మాత్రమే ఛార్జ్ పెట్టాలి. చార్జ్ పిన్ దగ్గర ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి.
ఈ రోజుల్లో 70 శాతం ఫోన్లు అన్నీ వాటర్ ప్రూఫ్ అలాగే స్ప్లాష్ ప్రూఫ్ లో వస్తున్నాయి. అయితే చార్జింగ్ పెట్టే పిన్ మాత్రం వర్షంలో తడిస్తే పూర్తిగా పాడవుతుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది? తక్కువ ఐపీ రేటింగ్ ఉన్న పోర్టుల్లో నీరు చేరితే వెంటనే అది పాడవుతుంది, మీడియం బడ్జెట్ ఫోన్లోడ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది.
దాదాపు 20 వేల రూపాయల పై ఖరీదు ఉన్న ఫోన్లకి పెద్ద డ్యామేజ్ ఉండదు. కొంచెం క్వాలిటీ ఉండే పోర్టులు ఇస్తారుఇక మీరు చార్జ్ పెట్టే USB వైర్ కచ్చితంగా చెక్ చేయండి. ఎక్కడా ఆ వైర్ తెగిపోకుండా ఉండాలి, దాని నుంచి కరెంట్ పాస్ అయితే అది పిల్లలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇలాంటి ఘటనలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. ఆ కేబుల్స్ కచ్చితంగా పరిశీలించండి.
మీరు ప్రీమియం ఫోన్‌లు వాడుతూ ఉంటే, మీరు కంపెనీ చార్జర్ వాడండి, ఒకవేళ సేమ్ అదే ఛార్జర్ వేరే వ్యక్తులది వాడితే ఫోన్ పాడవుతుంది..బ్యాటరీ పై ఒత్తిడి పెరుగుతుంది..కచ్చితంగా వాటర్ ప్రూఫ్ పౌచ్ వాడండి.
ఫోన్ తడిచింది అనిపిస్తే కచ్చితంగా మీరు పొడి వస్త్రంతో దానిని తుడవండి.
కొన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు వన్ ఇయర్ లోపు మీకు ఈ సర్వీస్ ఉచితంగా ఇస్తాయి అనేది గుర్తించండి.