దూరప్రాంతాలకు ప్రయాణం చేయాలి అంటే ట్రైన్ జర్నీకే అందరూ మొగ్గుచూపుతారు. నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు.
అయితే భారతీయ రైల్వే కూడా ప్రయాణికుల కోసం ఎన్నో కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. సోషల్ మీడియాలో కూడా రైల్వే అప్ డేట్స్ క్షణాల్లో ప్రజలకు అందుతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో క్విక్ గా రెస్పాన్స్ అనేది రైల్వే నుంచి వస్తోంది.
రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్దం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతంగా జర్నీ చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఉదయం పూట జర్నీ అంటే సాధారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, రాత్రి పూట ట్రైన్ జర్నీలో ఎన్నోజాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
రైల్వే కూడా గార్డులని సెక్యూరిటీని ట్రైన్స్ లో ఏర్పాటు చేస్తుంది. ప్రయాణికులకి రక్షణగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండేలా చూస్తుంది.
ఇటీవల రాత్రిపూట టీటీఈలు టికెట్ల చెకింగ్ కు వచ్చి నిద్రకు భంగం కలిగిస్తున్నారని పలువురు ప్రయాణీకులు భారతీయ రైల్వేకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వేశాఖ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది
TTE రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య స్లీపర్, AC కోచ్ లలో టికెట్లను తనిఖీ చేయకుండా రైల్వే మార్గదర్శకాలు ఉన్నాయి.
అయితే ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి ఎవరైనా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత 11 లేదా 12 గంటలు అర్దరాత్రి ట్రైన్ ఎక్కితే కచ్చితంగా ఆ ప్రయాణికుడి టికెట్ టీటీఈ చెక్ చేయవచ్చు. పది గంటల ముందు ట్రైన్ లో ఎక్కిన వారికి ఈ లోపు మాత్రమే చెకింగ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెకింగ్ ప్రాసెస్ ఉండదు. రాత్రి 10 తర్వాత ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోయే అవకాశం ఉంటుంది.
ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే 139లో రైల్వే హెల్ప్ డెస్క్ కు కాల్ చేయవచ్చు. ఇది 24 గంటలు పనిచేస్తుంది
ఇక రాత్రి సమయంలో ఫోన్లు సౌండ్ పెట్టుకుని తోటి ప్రయాణికులకి ఇబ్బంది కలిగించకూడదు
హెడ్ ఫోన్లు పెట్టుకుని ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా పాటలు మ్యూజిక్ వినవచ్చు
తోటి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రవర్తించాలి
రాత్రి పది గంటల తర్వాత, కోచ్ మెయిన్ లైట్లు ఆఫ్ చేయబడుతాయి.
రాత్రి పూట గట్టిగా మాట్లాడడం, అరవడం చేయకూడదు.
వీటిలో ఏ సమస్య వచ్చినా ప్యాసింజర్స్ 139కి కాల్ చేయవచ్చు.