అప్పట్లో మగధీర బడ్జెట్ చూసి చాలా మంది షాకయ్యారు. తర్వాత అది చాలా సినిమాలకు వే చూపించింది. ఆ తర్వాత బాహుబలి సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టినా ఆ సినిమాలు బాక్సాపీస్ దగ్గర వసూళ్ల జాతర చూపిస్తాయి.
ఇక కేజీఎఫ్, RRR, సాహో, ఆ తర్వాత వచ్చిన సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినా వసూళ్ల దగ్గర హీరోయిజం చూపించాయి.
అయితే గత సంవత్సరం 1000 కోట్ల వసూళ్లు దాటి 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించాయి. విచిత్రం ఏమిటి అంటే బాలీవుడ్ నుంచి కాదు రెండు టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలే.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం ఒకటి, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ సునామి క్రియేట్ చేశాయి గత ఏడాది.
కల్కి ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసింది.. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పార్ట్ ఏకంగా 1800 కోట్లు తీసుకువచ్చింది.
అయితే ఈ ఏడాది సినిమా పరిశ్రమలో 8 వ నెల పూర్తి అవుతోంది కానీ, ఇప్పటి వరకూ ఈరేంజ్ కలెక్షన్స్ బాక్సాఫీస్ దగ్గర తీసుకువచ్చిన సినిమాలు లేవు.. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు రాబట్టలేకపోయింది.
తాజాగా కూలి సినిమా 500 కోట్లు దాటింది కానీ 1000 కోట్ల మార్క్ చాలా కష్టం అనే చెప్పాలి. వార్ 2 కూడా ఆ రేంజ్ వసూళ్లు ఎవరూ ఆలోచన చేయడం లేదు. మరి రానున్న 4 నెలల్లో రిలీజ్ కానున్న సినిమాలపై చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు.
అందులో ఒకటి ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ఇది దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు.
డిసెంబర్‌లో రాజాసాబ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు, ఒకవేళ అది సంక్రాంతికి వస్తే మాత్రం ఈ ఏడాది లిస్ట్ నుంచి అది ఉండదు.
ఇక మిగిలింది కాంతార చాప్టర్ 2 ఈ సినిమా October 2 2025 న విడుదల కానుంది.. ఒకవేళ ఆ రికార్డు ఈ సినిమా చేరే అవకాశం ఉంటుంది తెలుగులో అయితే మరే సినిమా ఇంత స్ధాయిలో లేవు.. ఈ ఏడాది 1000 కొట్ల మార్క్ మాత్రం ఆశగానే ఉండిపోతుంది అంటున్నారు సినిమా లవర్స్.