Saturday, May 2, 2026
HomeNewsNADA: కోచ్‌లను, అథ్లెట్లను సస్పెండ్!

NADA: కోచ్‌లను, అథ్లెట్లను సస్పెండ్!

Published on

నాడా (National Anti Dopping Agency) అనేది ప్రతి అథ్లెట్‌ కోసం పని చేస్తుంది —

క్రీడా కారులు ఏ క్రీడలో ఉన్నా, ఏ సంఘంతో ఉన్నా, ఏ ప్రత్యేకత కలిగిఉన్నా NADA కు ఏటువంటి తేడా ఉండదు. NADA దృష్టిలో ప్రతి అథ్లెట్ ఒక్కరే.

న్యాయంగా పోటీలకు ప్రోత్సాహం ఇవ్వడం, క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడమే NADA యొక్క పని. NADA చేసే సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి.

నాడా ఇండియా, వాడా (WADA- – World Anti Dopping Agency ) మరియు ఇతర జాతీయ యాంటీ డోపింగ్‌ సంస్థలతో కలిసి క్రీడా పద్ధతులను బలోపేతం చేయడానికి,

మారుతున్న మార్గదర్శకాలను అభివృద్ధి చేయడంలో సహకరించేందుకు మరియు అథ్లెట్లు ప్రపంచవ్యాప్తంగా సమానమైన పోటీ స్థాయిలో పోటీపడగలుగుతూ ఉంటే వారు, NADA చర్యలు చేపడుతుంది.

భారత అథ్లెటిక్‌ రంగాన్ని వరుస డోపింగ్‌ కేసులు వెంటాడుతున్నాయి.

జూనియర్‌ జాతీయ బృందానికి ప్రధాన కోచ్‌గా ఉన్న రమేష్‌ నాగపూరిని డోపింగ్‌లో “పాలుపంచుకున్నట్లు” నిర్థారించడంతో నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది.

Also Read  CBSE Class 10th & 12th Result 2025: Class 10 & 12th result Live today

అలాగే ఏడుగురు అథ్లెట్లు డోప్ పరీక్షల నుంచి తప్పించుకున్నారని పీటీఐ నివేదికలో పేర్కొంది.

ఇక మరొద్దురు కోచ్‌లు — కరంవీర్‌ సింగ్‌, రాకేష్‌లను కూడా నాడా సస్పెండ్ చేసింది.

వీరిలో ఒకరు డోపింగ్‌లో సహకరించినట్లు, మరొకరు నిషిద్ధ పదార్థాల వాడకాన్ని నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నాడా తాజాగా విడుదల చేసిన డోప్ ఉల్లంఘనల జాబితాలో పరీక్షల నుంచి తప్పించుకున్న ఏడుగురు అథ్లెట్ల పేర్లు :

పారస్‌ సింఘాల్‌, పూజా రాణి, నలుబోతు శణ్ముగ శ్రీనివాస్‌, చెలిమి ప్రతూష, శుభం మహారా, కిరణ్‌, జ్యోతి.

రమేష్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయి) కేంద్రంలో అథ్లెటిక్‌ కోచ్‌గా పనిచేస్తున్నారు.

2023లో ఆయనను జాతీయ అథ్లెటిక్‌ ఫెడరేషన్ జూనియర్‌ చీఫ్‌ కోచ్‌గా నియమించింది. అలాగే ఇయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా.

రమేష్‌ను గతంలో అద్భుతమైన అథ్లెట్లను తీర్చిదిద్దిన కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ముఖ్యంగా జ్యోతి యెర్రారి, అలాగే గతంలో డ్యూటీ చంద్‌ను వారి తొలి ఒలింపిక్స్‌ ప్రదర్శనకు గైడ్ చేశారు.

Also Read  మీర్‌పేట్‌లో హిట్ అండ్ రన్.. యువకుడు మృతి..

ఆ సమయంలో డ్యూటీపై ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్ (IAAF) హైపరాండ్రోజెనిజం నియమాలు కారణంగా అంతర్జాతీయ స్థాయిలో నిషేధం విధించబడింది.

ఇందులో విశేషం ఏమిటంటే, ఇటీవలే అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (AFI) దేశంలోని అన్ని కోచ్‌లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది.

ఎందుకంటే, “డోపింగ్‌లో కోచ్‌ల ప్రమేయం ఉన్నదనే” విషయాన్ని వారు అంగీకరించారు.

గత జనవరిలో చండీగఢ్‌లో జరిగిన Annual Meeting లో, దేశంలోని అర్హత ఉన్న, లేని ప్రతి కోచ్‌ ,

ఈ సీజన్‌ నుంచి ఫెడరేషన్‌ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా AFI నిర్ణయం తీసుకుంది.

పోటీలు నిర్వహించే జాతీయ సంస్థ ఆధీనంలో శిక్షణ ఇవ్వాలంటే ఇది తప్పనిసరిగా చేయాలి అని AFI (Athelatic Fedration Of India) చెప్పింది.

AFI ఈ సమాచారాన్ని నాడా మరియు వరల్డ్ అథ్లెటిక్స్‌ ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (AIU)తో పంచుకుందని నివేదికలో పేర్కొంది.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...