జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా గురించి ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వార్ 2 సినిమా ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు నందమూరి అభిమానులు చాలా ఆనందించారు. కానీ బాలయ్య అభిమానులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు జరిగింది ఏమిటి ? వాళ్లు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అనేది చూస్తే, దానికి ఓ బలమైన కారణం ఉంది. నందమూరి బాలకృష్ణని తారక్ అవమానించాడు అంటూ చాలా సీరియస్ గా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.
కొన్నాళ్లుగా నందమూరి కుటుంబంలో తారక్ బాలయ్య మధ్య అంతగా మాటల్లేవు అనేది
స్పష్టంగా తెలుస్తోంది. ఈవెంట్లు, కుటుంబ కార్యక్రమాల్లో తారసపడినా పెద్దగా పలకరించుకోవడం లేదు.
గతంలో బాలయ్య ఇక్కడ ఫ్లెక్స్ లు తీయండి అంటూ చేసిన కామెంట్లు కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక ఏదైనా ఈవెంట్లు జరిగినా ఇరువురు కూడా పెద్దగా ఒకరి గురించి ఒకరు మాట్లాడిన సందర్బాలు ఇటీవల జరగలేదు.
ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు
నందమూరి ఫ్యామిలీకి అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇటీవల కొంత దూరాన్ని పాటిస్తున్నారు
అనేది కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తోంది. పొలిటికల్ గా కూడా తారక్ పై కొందరు టీడీపీ నేతలు గుర్రుగానే ఉన్నారు,
జగన్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు అయినా సరే ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ స్పందించలేదు, దీనిపై కూడా రాజకీయంగా పెద్ద చర్చ సాగింది.
హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సమయంలో తారక్ ఆయనను అభినందించారు. అయితే కుటుంబం అంతా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ ఈ ఇద్దరు సోదరులకి ఆహ్వానం అందలేదు. ఇలా చాలా విషయాల్లో నందమూరి కుటుంబంలో వీరి ఇద్దరు ఒంటరి అవుతున్నారు. దీంతో విభేదాలు ఉన్నాయి అని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇంత సైలెంట్ వార్ నడుస్తున్న వేళ, తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నందమూరి కాంపౌండ్ లో చర్చకు కారణం అయ్యాయి..హైదరాబాద్ లో వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు ఎవరూ లేరని, తన పక్కన అమ్మ, నాన్న మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాతయ్య పేరు చెప్పాడు తన తండ్రి అన్నదమ్ముల పేర్లు చెప్పాడు కానీ కుటుంబానికి పెద్దగా ఉన్న బాబాయ్ బాలయ్య పేరు మాత్రం చెప్పలేదు. దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు బాలయ్య అభిమానులు.
గతంలో పెద్ద హిట్స్ లేని సమయంలో బాలయ్య బాబాయ్ నాకు కింగ్ ,మా తాత, నాన్న బాబాయ్ నాకు దేవుళ్లు అంటూ చెప్పిన ఎన్టీఆర్, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అంటూ బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. కనీసం బాబాయ్ పేరు కూడా చెప్పవా అంటూ బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ అవుతు