దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒక అంశం పై చర్చ సాగుతోంది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అన్నీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ శ్రేణులు ఈ అంశం పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓటర్ల జాబితాలోని అవకతవకల గురించి ఇటీవల అంటే ఆగస్టు 7న, రాహుల్ గాంధీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని తర్వాత ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అయింది.
అసలు రాహుల్ ఏమి కామెంట్ చేశారు? ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనేది చూస్తే.
రాహుల్ గాంధీ ఆగస్టు 7న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎన్నికల సంఘం గురించి దాదాపు గంట పాటు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈసీ పై ఆయన అనేక ఆరోపణలు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడారు, ఓట్లు దోపిడికి గురి అవుతున్నాయి అని ఎన్నికల సంఘం పై ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా ఉదాహరణగా కర్ణాటకలోని మహదేవపుర లోక్ సభ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తారుమారు చేశారని,
డూప్లికేట్ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని, దొంగ ఓట్లు, తప్పుడు చిరునామాలతో ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు చేరుస్తున్నారని ఆరోపించారు. అసలు ఇంటి చిరునామా జీరోతో కూడా అనేక ఓట్లు ఉన్నాయి అంటూ ఆయన సీరియస్ అయ్యారు.
కొత్త ఓటర్ల కోసం ఉన్న ఫామ్ 6ను దుర్వినియోగం చేస్తున్నారని, ఒకే అడ్రస్ పై 20 లేదా 30 మందికి ఓట్లు ఉన్నాయి అని ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు అంటూ సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. అంతేకాకుండా 70 ఏళ్ల శకున్ రాణి అనే మహిళ ఫామ్ 6ను ఉపయోగించుకుని తొలిసారి ఓటర్ గా నమోదు చేయించుకుంది, ఇలా ఆరు నెలల కాలంలో రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దీనిపై చెక్ చేస్తే ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు రెండు సార్లు ఉంది.
ఇలాంటి ఉదాహరణలు వేలకు పైనే ఉన్నాయి అంటూ రాహుల్ సీరియస్ అలిగేషన్ చేశారు.
కొందరికి రెండు రాష్ట్రాల్లో కూడా ఓట్లు ఉన్నాయి. వారు ఎక్కడ ఎక్కడ ఓట్లు వేశారు ఇలా అనేక ప్రశ్నలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. బీజేపీతో కలిసి ఈసీ ఈ కుట్ర చేస్తోందని రాహుల్ అన్నారు.
ప్రజలు, పార్టీలు ధృవీకరించేలా ఈసీ డిజిటల్ ఓటరు జాబితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇలా చేస్తే పారదర్శకత పెరుగుతుందన్నారు రాహుల్.
ఈ ఆరోపణల తర్వాత రాహుల్ ఓటర్ చోరి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.రాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ మద్దతు పక్షాలు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. అయితే రాహుల్ కామెంట్ల పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది, ఇవన్నీ ఆధారాలు లేని కామెంట్లు అంటూ రాహుల్ కి కౌంటర్ ఇచ్చింది.
ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి బీజేపీ నుంచి ఎల్ కే అద్వానీ కూడా గతంలో ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా గతంలో ఈసీ నిర్ణయాలపై తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఇది కొత్త ఏమీ కాదు. ఓటమి తర్వాత రాజకీయ పార్టీలు చేసే సాధారణ కామెంట్ ఇది. అయితే బీజేపీ కూడా వారు ఎన్నికల్లో ఓటమి చెందారు కాబట్టి ఇలా అంటున్నారు. అధికార పక్షం పై బురదచల్లే ప్రక్రియ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలకి కౌంటర్ ఇస్తోంది.
రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఈసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఎత్తి చూపిన అంశాలు అన్నీ నెలల క్రితమే సరిచేశాము, ఏదైనా చట్టబద్దంగా చేయాలి కాని ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడం సరికాదు, రాహుల్ వ్యాఖ్యల తర్వాత కర్ణాటక సీఈఓతో పాటు హర్యానా, మహారాష్ట్ర పలు రాష్ట్రాల ఎన్నికల అధికారులు రాహుల్ గాంధీకి నోటిసులు ఇచ్చారు. ఆయన చేసిన ఆరోపణలకు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని, సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించాలని లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది