కొన్ని సినిమాలు పెద్దగా పెట్టుబడి పెట్టకపోయినా కంటెంట్ తో దూసుకువెళుతూ ఉంటాయి. సినిమాలో పెద్ద స్టార్లు కాస్టింగ్ లేకపోయినా సంచలనాలు నమోదు చేస్తాయి. మన తెలుగులోనే కాదు సౌత్ లో ముఖ్యంగా కేరళ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇక కాంతార అలాగే ఇప్పుడు మహావతార్ నరసింహ ఈ సినిమాలు కూడా 100 టైమ్స్ కంటే మరింత లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే తాజాగా కన్నడ సినిమా పరిశ్రమలో విడుదలైన ఒక సినిమా సరికొత్త చరిత్ర రాసింది.
ఒక సాధారణ సినిమాగా విడుదలై ట్రెండ్ సెట్ చేసింది బాక్సాఫీస్ దగ్గర. ఇందులో పెద్ద స్టార్ నటులు లేరు, పెద్ద విలన్స్- వీఎఫ్ ఎక్స్ ఇలా ఏమీ స్పెషల్ లేదు. కాని కంటెంట్ మాత్రం జనానికి విపరీతంగా నచ్చింది.
నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అంటే అర్దం చేసుకోవచ్చు ధియేటర్లకి జనాలు ఎలా వస్తున్నారో.
కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఏమిటా సినిమా అనుకుంటున్నారా? కన్నడ లేటస్ట్ కామెడీ హారర్ మూవీ సు ఫ్రమ్ సో. ఈ సు ఫ్రమ్ సో మూవీ అర్బన్, సిటీ ఎక్కడ చూసినా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఈ మధ్య విడుదలైన సినిమాల్లో ఈ సినిమా చాలా మంచి స్పందన దక్కించుకుంది.
జూలై 25 న కన్నడలో థియేటర్లలో రిలీజ్ అయిన సు ఫ్రమ్, బాక్సాఫీస్ దగ్గర దాదాపు 85 నుంచి 90 కోట్ల మధ్య కలెక్షన్స తీసుకువచ్చింది అంటున్నారు సినిమా అనలిస్టులు.కేవలం 5 నుంచి 6 కోట్ల మధ్య మాత్రమే బడ్జెట్ అయింది. ఈ సినిమా వసూళ్లు చూసి అందరూ నివ్వెరపోయారు. నిర్మాతలకు బయ్యర్లకు కనక వర్షం కురిపించింది.
మరి ఇంతటి టాప్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? ఏ ఓటీటీలో ప్రసారం కానుంది అనేదాని గురించి మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు..ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ తొలి వారంలో స్ట్రీమింగ్ అవ్వనుంది అని తెలుస్తోంది.
దర్శకుడు రాజ్ బి శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు.
ఇది తెలుగులో కూడా రిలీజ్ అయింది. కానీ యావరేజ్ వసూళ్లు తీసుకువచ్చింది.