Saturday, January 31, 2026
HomeNewsజూబ్లీహిల్స్‌ టికెట్ ఎవ‌రికి... రేసులో ఈ ముగ్గురు?కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్

జూబ్లీహిల్స్‌ టికెట్ ఎవ‌రికి… రేసులో ఈ ముగ్గురు?కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్

Published on

తెలంగాణ‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ హైద‌రాబాద్ సిటీలో అత్య‌ధిక సీట్లు గెలుచుకుంది. అయితే
ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించే, ఈ ఉప ఎన్నిక‌ గెలుపు బ‌ట్టి జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కూడా ఇది ఎఫెక్ట్ ప‌డుతుంది అని రాజ‌కీయ పార్టీలు ఆశ‌లు పెట్టుకున్నాయి.

ఇక అన్నీ పార్టీల్లో కూడా ఆశావహుల లిస్ట్ పెద్ద‌గానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో హైద‌రాబాద్ నుంచి హ‌స్తిన వ‌ర‌కూ పార్టీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు టికెట్ కోసం.

ఎందుకంటే అంత ప్ర‌స్టేజ్ సెగ్మెంట్ జూబ్లిహిల్స్. ఇటీవ‌ల మాగంటి గోపీనాధ్ ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉండి మ‌ర‌ణించారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయింది.

అయితే ఏ పార్టీ త‌ర‌పున ఆశావహులు ఎవ‌రు ఉన్నారు అనేది చూస్తే, ముందు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే, గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అజహారుద్దీన్‌ ఈసారి కూడా త‌న‌కు టికెట్ ఇవ్వాలి అని కోరుతున్నారు. హ‌స్తిన వేదిక‌గా ఆయ‌న మంత‌నాలు జరుగుతున్నారు.

Also Read  నాకు వాళ్లు అన్యాయం చేశారు ఆ రోజు అన్నీ తెలియ‌చేస్తా - యాంక‌ర్ ఉద‌యభాను


నాన్‌ లోకల్‌కు టికెట్‌ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్‌ అని స్టేట్ కాంగ్రెస్ లీడ‌ర్లు తెలియ‌చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, న‌వీన్ యాద‌వ్, విజ‌యా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్‌ రెడ్డి అలాగే కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎం.ఐ.ఎం సింగిల్ గా పోటికి వస్తుందా, లేదా ఏదైనా పార్టీతో క‌లుస్తుందా అనేది కాలం నిర్ణ‌యించాలి.

బీఆర్‌ఎస్‌ తరఫున మాగంటి గోపీనాధ్ భార్య సునీత పేరు వినిపిస్తుంది, అయితే మెజార్టీ ఆమే పేరే తెర‌పైకి వ‌స్తుంది. క‌చ్చితంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే బీఆర్ఎస్ ఇక్క‌డ టికెట్ ఇవ్వ‌నుంది.

ఒక‌వేళ బీఆర్ఎస్ ఆలోచ‌న చేస్తే పీజేఆర్‌ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు.

జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మ‌ర‌ణించారు, దీంతో ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆరునెలల్లో ఉప ఎన్నిక‌ జ‌రగాలి.

Also Read  అసలు HCU లో ఏమిజరిగింది ఇప్పుడు ఏమి జరుగుతుంది.

2025 డిసెంబర్‌లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్‌లో నోటిఫికేష‌న్ విడుదలై, అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండ‌వ‌చ్చు.

బీఆర్ఎస్ క‌చ్చితంగా సిట్టింగ్ స్ధానం నిలబెట్టుకోవాలి అని చేస్తుంటే, కాంగ్రెస్ లీడ‌ర్లు మాత్రం సిటీలో క‌చ్చితంగా ఈసారి గెలుపు త‌మ‌దే అవ్వాలి అని కంక‌ణం క‌ట్టుకున్నారు, ఇక బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
మ‌రి ఇక్క‌డ పోటీ చాలా గ‌ట్టిగానే ఉండ‌బోతోంది అనేది స్ప‌ష్టం అవుతోంది రాజ‌కీయ ప‌రిణామాల‌తో.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...