హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్ధగా పేరు పొందిన యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై, నిర్మాత ఆదిత్య చోప్రా వార్ 2 చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ అలాగే స్టార్ నటుడు ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు. ఆగస్ట్ 14 న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతాయి. తాజాగా అమెరికాలో కొన్ని చోట్ల ప్రీమియర్స్ స్పెషల్ షోలు పడ్డాయి. మరి అక్కడ నుంచి సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంది అనేది ఓసారి చూద్దాం.
సినీ నిర్మాణ సంస్థ – యష్ రాజ్ ఫిలింస్
నిర్మాత -ఆదిత్య చోప్రా
దర్శకత్వం – అయాన్ ముఖర్జీ
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్
కియారా అద్వానీ
అజ్ఞాతంలో ఉన్న హృతిక్ ను పట్టుకునేందుకు భారత స్పై ఏజెంట్ తారక్ ను పంపిస్తారు, తారక్ హృతిక్ మధ్య ఏం జరుగుతుంది. చివరకు తారక్ విజయం సాధించాడా, హృతిక్ చిక్కాడా లేదా అనేది స్టోరీ.
వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా దర్శకుడి టేకింగ్ అదిరిపోయింది. ఇక యాక్షన్ ఎపిసోడ్ లో ఇద్దరిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు, హృతిక్ తన స్టైలిష్ లుక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, డాన్స్ లతో ఎన్టీఆర్ మ్యాజిక్ చేశాడు అనే చెప్పాలి.
అయాన్ ముఖర్జీ టేకింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.
ముఖ్యంగా విదేశాల్లో కొన్నియాక్షన్ ఎపిసోడ్లు షూట్ చేశారు అవి సినిమాకి వేరే లెవల్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి.
కధలో మంచి బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లైమాక్స్ ఇరువురి ఫ్యాన్స్ కన్విన్సింగ్ అయ్యేలా ఉంది.
తెరపై ఇద్దరు నువ్వా నేనా అనే రేంజ్ లో నటించారు. ఈ సినిమా థియేటర్లలో ప్రారంభమైన 16 నిమిషాలలోపే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంది. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందని, ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ డామినేషన్ ఉందని అంటున్నారు. ఇక సినిమాలో హృతిక్ కంటే ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువగా ఉందని టాక్ వస్తోంది. ఫస్ట్ఆఫ్ కంటే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్లు సూపర్బ్‌గా ఉన్నాయి.
మంచి స్టోరీతో సస్పెన్స్ ఎలిమెంట్స్ సెకండాఫ్ లో ఉందని, ఇక ఈ సస్పెన్స్ ఎలిమెంట్లు సినిమా చూసిన వారు ఎవరికి బయట రివీల్ చేయకుండా ఉంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుంది అంటున్నారు.
క్లైమాక్స్ ఈ సినిమాకు బలంగా నిలిచిందని టాక్ సంపాదించుకుంది.యాక్షన్ సినిమా లవర్స్ కి వార్ 2 సినిమా పండుగ అనే చెప్పాలి. అమెరికా ఓవర్సీస్ మార్కెట్లో అదిరిపోయే టాక్ సంపాదించుకున్న వార్ 2 రేపు దేశంలో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి