సౌత్ ఇండియాలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన సినిమా కూలి.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని,
మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్,
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర,
మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్,
స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ ఈ సినిమాలో కీలక రోల్స్ పోషించారు.
ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.ఆగస్ట్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ముందు రోజు అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతాయి అనే విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇప్పటికే షోలు పడ్డాయి, మరి ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం.
ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని, తమ పని కోసం వాడుకుంటూ కొందరిని బానిసలుగా మారుస్తు ఉన్న ముఠా ఆటకట్టించడమే హీరో పని. ఈ గ్యాంగ్ ని దేవా అంతం చేశాడా ? అతని స్నేహితుడి కోసం రజినీ ఎంత దూరం వెళ్లాడు, అసలు ఈ గ్యాంగ్ చేస్తున్న పని ఏమిటి అనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.
రజనీకాంత్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం పైసా వసూల్ , వన్ మ్యాన్ షో అంటున్నారు రజనీ నటనపై.
రజీనీకాంత్ నటన అదిరిపోయింది అంటున్నారు.
ఈ సినిమాలో నాగార్జున తొలిసారి విలన్ రోల్ చేశారు, మంచి పాత్ర సినిమాలో ఇంపాక్ట్ ఉన్న రోల్ చాలా బాగుంది అనే టాక్ వచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కాస్త డల్ అయింది అనే మాట వినిపించింది.
ముఖ్యంగా క్లైమాక్స్, సినిమా చివరి 18 నిమిషాలు ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది.
పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ , బీజీఎమ్ సినిమాకి ప్రాణం పోశాయి. యాక్షన్ విషయంలో ఎక్కడా తగ్గలేదు.
రజనీకాంత్ ని వేరే లెవల్‌లో చూపించిన తీరు అభిమానులకి బాగా నచ్చుతుంది. సినిమాలో ఒక బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఉంది అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది
అమీర్ ఖాన్ ఒక మంచి రోల్ చేశారు. మొత్తంగా పైసా వసూల్ మూవీ అనే చెప్పాలి.పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ మోనికా పాట వచ్చినప్పుడు ధియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
ఫైనల్ గా కూలి సినిమా యాక్షన్ పవర్ ఫుల్ ఫ్యాక్ అనే చెప్పాలి. రజనీ ఫ్యాన్స్ కి ఓ మంచి ఫీస్ట్ ఇస్తుంది. ఇక అమెరికాలో ఈ టాక్ ఉంటే రేపు దేశ వ్యాప్తంగా ఎలాంటి టాక్ సంపాదిస్తుందో చూడాలి.