హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి వస్తున్నాం సినిమాతో అదరగొట్టారు. ఇక వెంకీ నెక్ట్స్ సినిమాల లైనప్ గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా వెంకీ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి పిచ్చ క్రేజ్. ఆయన నుంచి ఇలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సినిమా వస్తుంది అంటే క్యూ కడతారు జనాలు, అయితే తాజాగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు వినిపించాయి ఫైనల్ గా నేడు ఈ సినిమా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. హీరో వెంకటేష్ ఈ విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఓపెనింగ్ వేడుకకి సినిమా పెద్దలు హాజరు అయ్యారు
. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చి ఏడున్నర నెలలు అయింది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇక వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండనుంది అని తెలుస్తోంది.
వెంకటేష్ కెరీర్ లో ఇది 77వ చిత్రం ఈ సినిమాని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ చినబాబు నిర్మించనున్నారు.
ఇక కుటుంబ కధా చిత్రంగా ఫుల్ ఫన్ జనరేట్ అయ్యేలా ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ బ్యూటీ ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
హీరో విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 300 కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి అంటున్నరు ఫ్యాన్స్.