Saturday, January 31, 2026
HomeNewsఅక్క‌డ‌ 80 మృతదేహాలు పాతిపెట్టాను...ధర్మస్థల కేసులో సాక్షి చెప్పిన సంచ‌ల‌న విష‌యాలు తీరా తవ్వి చూస్తే?

అక్క‌డ‌ 80 మృతదేహాలు పాతిపెట్టాను…ధర్మస్థల కేసులో సాక్షి చెప్పిన సంచ‌ల‌న విష‌యాలు తీరా తవ్వి చూస్తే?

Published on

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల‌ ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే అంద‌రికి తెలుసు.

అయితే గ‌త కొన్ని నెల‌లుగా ఒక సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు కార‌ణం అయింది. గ‌త‌ నెలలో ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు.

అలా చ‌నిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్‌ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ఆ మృత‌దేహాల‌ని తాను పూడ్చాను అని సంచ‌ల‌న విష‌యాలు చెప్పాడు.

అయితే ఆ వ్య‌క్తి ఇలాంటి విష‌యాలు చెప్ప‌డంతో, పోలీసులు కేసు న‌మోదు చేశారు, దీనిని సిద్ద‌రామ‌య్య స‌ర్కార్ చాలా సీరియ‌స్ గా తీసుకుంది.

Also Read  జూబ్లీహిల్స్‌ టికెట్ ఎవ‌రికి... రేసులో ఈ ముగ్గురు?కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్

అక్క‌డ క‌ర్ణాట‌క‌ ప్ర‌భుత్వం సిట్ వేసింది. సాక్షి చెబుతున్న చోట్ల త‌వ్వ‌కాలు జ‌రుపుతోంది… ఈ అంశం పై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆధారాలు, చెప్పిన విషయాలతో ధర్మస్థల లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కొన్ని ఆన‌వాళ్లు దొరికాయి. అయితే వాటిపై లోతైన ప‌రిశోధ‌న చేస్తున్నారు అధికారులు.

తాజాగా మ‌రో విషయం చెప్పాడు ఆ సాక్షి, ఒకేచోట దాదాపు 80 మృత‌దేహాల‌ను తానే గొయ్యి త‌వ్వి పాతేశానుఅంటున్నాడు, ఈ మాట విన‌డానికి కూడా కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంది అంటున్నారు అధికారులు

ప్ర‌జ‌లు అయితే అన్నీ కోణాల్లో విచార‌ణ చేస్తుంది సిట్. 1998 నుంచి 2014 మధ్య శానిటైజేషన్ వర్కర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి ఈ కీల‌క విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు.

ఇప్పుడు ఎందుకు ఈ విష‌యాలు బ‌య‌ట‌పెట్టావు అని ప్ర‌శ్నిస్తే, నేను చేసిన పాపం చెప్పాలి, నాకు నిద్ర ప‌ట్ట‌డం లేదు ఆ శ‌వాలు అస్దిపంజ‌రాలు త‌న‌కు గుర్తు వ‌స్తున్నాయి అని తెలియ‌చేస్తున్నాడు.

Also Read  అసలు అమ్మాయిలకి ప్రతినెల పీరియడ్స్ ఎందుకు వస్తాయి..?

నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల అటవీ ప్రాంతంలో తాను ఒక్కడినే చాలా శవాలను గొయ్యితీసి పాతిపెట్టినట్లు ఆ ప్రధాన సాక్షి తెలిపాడు.

ఆలయ పర్యవేక్షకులు త‌న‌కు ఈప‌ని అప్ప‌చెప్పారు అని వారు ఎవ‌రూ త‌న‌తో నేరుగా చెప్ప‌కపోయినా వారి సిబ్బందితో నాకు అమ‌లు చేయ‌మ‌ని చెప్పాడు అంటున్నాడు.

15 ప్రాంతాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపించగా.. సైట్‌ నంబర్‌ 6లో మాత్రమే ఓ మానవ అస్థిపంజరం లభించింది. సైట్‌ నంబర్‌ 13లో 80 మృతదేహాలను పాతిపెట్టినట్లు అత‌ను చెబుతున్నాడు.

అయితే అక్క‌డ చాలా లోతుగా తాను శ‌వాల‌ను పూడ్చాను అంటున్నాడు. దానిపై కూడా విచార‌ణ చేస్తున్నారు అధికారులు.

అటవీ ప్రాంతాలు, పాత రోడ్లపై మాత్రమే మృతదేహాలను పాతిపెట్టేవాళ్లం అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు చాలా మారిపోయింది ఆ ప్రాంతం.

రోడ్లు వెడ‌ల్పు అయ్యాయి అందులో కొన్ని తాను గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నాను అంటున్నాడు. వర్షాలతో భూమి కోతకు గురికావడం, అడవులు పెరిగిపోవడం, నిర్మాణ పనుల కారణంగా పాతిపెట్టిన ప్రాంతాలు త‌న‌కు అంత‌గా గుర్తు లేవు అంటున్నాడు, అయితే సిట్ మాత్రం మార్క్ చేసిన‌వి గుర్తించి ప్రాంతాల్లో త‌వ్వ‌కాలు చేస్తోంది.

Also Read  CBSE Class 10th & 12th Result 2025: Class 10 & 12th result Live today

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...