స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ వినిపించారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
దీపావళి లోగా సామాన్యులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే అది ఏమిటి అని అనుకుంటున్నారా, కొత్తతరం జీఎస్టీ దీంతో కొన్ని వస్తువుల ధరల రేట్లు భారీగా తగ్గుతాయి ఎందుకంటే కొన్ని వస్తువులకి పన్నులు రేట్లు తగ్గనున్నాయి, దీంతో ఆ వస్తువులు మరింత చవకగా రానున్నాయి.
ఆయన ఏమి చెప్పారు అనేది చూస్తే దీపావళికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము, 8 సంవత్సరాలుగా జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు చేశాం, ఇక దీనిన సమీక్షించాల్సి ఉంది ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో చర్చలు చేస్తున్నాం కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు రానున్నాయి అని తెలియచేశారు మోదీ.
దీంతో పన్నుల ధరలు కొన్ని వస్తువుల పై తగ్గనున్నాయి అనేది తెలుస్తోంది.
ఇది చిన్నచిన్న కంపెనీలకి ముఖ్యంగా MSME లకు ఎంతో ప్రయోజనం చేస్తుంది. ఇక ప్రతీ రోజు జనం ఉపయోగించుకునే నిత్యవసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి.
ప్రస్తుతం జీఎస్టీ కింద పన్ను రేట్లు 0, 5, 12, 18, 28 శాతాలుగా శ్లాబులు ఉన్నాయి. మరి వీటిలో ఎలాంటి మార్పు ఉంటుంది, ఏఏ వస్తువులు మరింత తగ్గుతాయి అనేది దీపావళికి క్లారిటీ రానుంది.
జీఎస్టీని 2017, జులై 1న ప్రవేశపెట్టారు. వస్తు, సేవలపై దేశమంతా ఒకే విధంగా విధించే పరోక్ష పన్నే జీఎస్టీ. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ప్రధాన ఆదాయ వనరు అని చెప్పాలి.
ఈ ఏడాదిలో ప్రతి నెలలో జీఎస్టీ వసూళ్లు1.8 లక్షల కోట్ల పైనే ఉంటున్నాయి ( సరాసరిగా)
ఆరోగ్య బీమా, టర్మ్ లైఫ్ ఇన్ష్యూరెన్స్‌లపై జీఎస్‌టీను తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు. ఇదికూడా ప్రజలకు చాలా ఉపయోగకరం.