ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఓ గుడ్ న్యూస్ తెలియచేశారు. అంతేకాదు ఓ అద్బుత పథకం గురించి ప్రకటన చేశారు.
ఇక పై ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున రూ.15 వేలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనే స్కీమ్ ఇది.
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ఈ స్కీమ్ కి, సుమారు 1 లక్ష కోట్ల రూపాయలను కేటాయిచనున్నారు.
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ముఖ్య ఉద్దేశాలు, ప్రయోజనాలు. యువతకు ఎలాంటి అర్హత ఉండాలి అనేది కూడా తెలుసుకుందాం.
చదువుకున్న యువతక దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది.
ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్‌లో ప్రకటించారు.
ఈ ఏడాది ఆగస్ట్ 1 నుంచి అమలులోకి తీసుకువచ్చారు.మొదటిసారి ఉద్యోగంలో చేరి EPFO లో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం నేరుగా 15 వేలు చెల్లిస్తుంది.ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి రూ.3,000 వరకు ప్రోత్సాహకం అందిస్తారు.
ఇలా ఆ కంపెనీలకి రెండు సంవత్సరాలు నగదు ఇస్తారు. ముఖ్యంగా వస్తువుల తయారీ మానిఫ్యాక్చరింగ్ యూనిట్ల రంగాలపై దృష్టిపెట్టేలా దీనిని తీసుకువచ్చారు. యువతకు ప్రైవేట్ సెక్టార్ లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి.
కొత్తగా మన దేశంలో ఈ ప్రైవేట్ సెక్టార్ లో దాదాపు 2.5 నుంచి 3 కోట్ల ఉద్యోగాలు వస్తాయి
దీని వల్ల రానున్న రెండు సంవత్సరాల్లో 1.5 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది ఉద్యోగంలో చేరతారు అని అంచనా.
ఎవరైతే ఉద్యోగంలో కొత్తగా చేరతారో ఆ ఉద్యోగి UAN (Universal Account Number) నంబర్ పొందుతారు, ఏడాదికి 15 వేలు కేంద్రం ఇస్తుంది.
రెండు విడతలుగా ఉద్యోగంలో చేరిన తర్వాత అందజేస్తారు. గరిష్టంగా రూ.1 లక్ష వరకు జీతం ఉన్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. ఆరు నెలలు 7500, తర్వాత ఆరు నెలల 7500 ఇస్తారు.
ఇక ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి కూడా నెలకు రూ.3,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. ఈ మొత్తాన్ని 2 సంవత్సరాల వరకు అందిస్తారు.
దీని కోసం కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కంపెనీ EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి.
ఇక కచ్చితంగా ఉద్యోగం వచ్చిన తర్వాత అదే కంపెనీలో ఆరు నెలలు వర్క్ చేయాలి
మొదటిసారి మీ PF ఖాతా తెరిచిన వెంటనే, మీరు ఈ పథకానికి అర్హులు అవుతారు. మీరు ప్రత్యేకంగా ఈ పథకానికి అప్లై చేయక్కర్లేదు.
నోట్ — తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే ఈ పథకం అనేది మరువవద్దు