ఆగస్ట్ నెల పండుగలు అన్నీ ఒకే నెలలో వచ్చాయి. ఈ నెల మొత్తం పండుగల శోభ కనిపిస్తోంది అందరి ఇంట. వరలక్ష్మీవ్రతం, రాఖీపండుగ, కృష్ణాష్టమి,వినాయకచవితి ఇలా అన్నీ ఈనెలలో వరుస పెట్టి పండుగలు వచ్చాయి.
శ్రీకృష్ణాష్టమి వేడుక దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి. కిట్టయ్య పుట్టినరోజుని దేశమంతా ఉత్సవాలలా చేస్తారు.
అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కృష్ణాష్టమి తర్వాత కొన్నిరాశుల వారికి మహర్దశ పట్టనుంది. జ్యోతిష పరంగా కూడా ఈ రాశుల వారికి కొన్ని యోగాలు రానున్నాయి మరి ఆ రాశులు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
కృష్ణాష్టమి రోజు నుంచి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఉదయం 11:40 నిమిషాల నుంచి .శుక్రుడు, గురువు మిధున రాశిలో సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకోని సంపదని పేరు ప్రతిష్టలని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం రానుంది.
వృశ్చిక రాశి
వీరికి ఈ ఏడాది మే నెల నుంచి మానసిక ప్రశాంతత లేదు, ఆరోగ్య ఇబ్బంది ఉంది. కాని ఈ కృష్టాష్టమి తర్వాత మీ రోజులు బాగున్నాయి. ఆర్దిక పరిస్దితి బాగుంటుంది.
తల్లిదండ్రులు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీకు ఉన్న అప్పులు కూడా తీరుతాయి.. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి చాలా పేరు రానుంది. ఉన్నత పదవులు వస్తాయి. ఇక వివాహ యోగం కూడా కనిపిస్తోంది.
డిసెంబర్ వరకూ మీరు పట్టిందల్లా బంగారం కానుంది . కానీ వ్యాపారం కొత్తగా ప్రారంభిస్తే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.
మేషరాశి
మేష రాశి వారికి శ్రీకృష్ణాష్టమి తర్వాత మంచి ఫలితాలు వస్తున్నాయి, ముఖ్యంగా అప్పుల నుంచి బయటపడతారు. సమాజంలో మీకు మరింత గౌరవం పెరుగుతుంది. అక్క చెల్లెల్ల వివాహాలు సోదరులుగా దగ్గర ఉండి చేస్తారు.
విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు కెరీర్ బాగుంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు వాహానాలపై వెళ్లే సమయంలో కాస్త జాగ్రత్త అనేది ఉండాలి. భార్య నుంచి వారి తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పొందే అవకాశం కనిపిస్తోంది.
వృషభరాశి
ఈ ఏడాది మీరు పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇక అష్టమి నుంచి మరింత పాజిటీవ్ రోజులు కనిపిస్తున్నాయి. మీరు విష్ణుమూర్తి ఆలయాలు దర్శించండి. పిల్లలు నుంచి గుడ్ న్యూస్ వింటారు.
వారికి ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు రావచ్చు, అలాగే విదేశాల్లో మంచి ఉద్యోగం పొందే అవకాశం రావచ్చు.
ఓం నమో భగవతే వాసుదేవాయ