టాలీవుడ్ యూత్ స్టార్ హీరో నితిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని తన అభిమానులకి ఒక గుడ్ న్యూస్ తెలియచేశారు. ఆయనకు ఒక కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే అయితే ఆ బాబు పేరు ఫోటోలు ఇప్పటి వరకూ పంచుకోలేదు. తాజాగా నితిన్ తన కుమారుడి పేరు తెలియచేశారు సోషల్ మీడియా వేదికగా.
నితిన్ 2020లో షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం.
2024 సెప్టెంబర్ 6న వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే ఈ గుడ్ న్యూస్ ఆ నాడు అందరితో పంచుకున్నాడు. ఆ తర్వాత అసలు ఒక్క ఫోటో కాని ఆ బాబుపేరు కానీ ఎవరికి వెల్లడించలేదు.
సుమారు 11 నెలల తర్వాత శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు.
తన కుమారుడికి అవ్యుక్త్ అని పేరు పెట్టినట్లు తెలియచేశాడు. అయితే ఈ పేరు చాలా కొత్తగా ఉందని వినడానికి పిలవడానికి చాలా బాగుందని అభిమానులు అంటున్నారు. నితన్ తన కొడుక్కి భలే పేరు పెట్టాడు అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ విషెస్ తెలియచేస్తున్నారు.
ఇక నితిన్ సినిమాల లైనప్ చూస్తే ఈ ఏడాది రాబిన్ హుడ్ చిత్రం చేశాడు అది అనుకున్నంత హిట్ అవ్వలేదు, తర్వాత నితిన్ తమ్ముడు అనే సినిమాతో వచ్చాడు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.
ప్రస్తుతం బలగం దర్శకుడు వేణు తో ఎల్లమ్మ సినిమా చేయనున్నారు, ఇంకా ఇది షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు.