Friday, March 20, 2026
HomeNewsగుడ్ న్యూస్.. మంచు బ్ర‌ద‌ర్స్ క‌లిసిపోయారు..ఇదిగో ఈ పోస్ట్ సాక్ష్యం

గుడ్ న్యూస్.. మంచు బ్ర‌ద‌ర్స్ క‌లిసిపోయారు..ఇదిగో ఈ పోస్ట్ సాక్ష్యం

Published on

కొన్ని నెల‌ల క్రితం మంచు వారి కుటుంబ వివాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రూ చ‌ర్చించుకున్నారు. మంచు మ‌నోజ్, విష్ణు, మంచు మోహ‌న్ బాబు ఈ కుటుంబ గొడ‌వ‌ల‌తో పోలీసు కేసుల వ‌ర‌కూ వీరి వ్య‌వ‌హారం వెళ్లింది.

మ‌నోజ్ ని ఇంటి నుంచి కూడా బ‌య‌ట‌కు పంపించేశారు. ఈ వివాదం త‌ర్వాత కాస్త సైలెంట్ అయ్యారు ఇరువురు. త‌ర్వాత మ‌నోజ్ బైర‌వం సినిమా చేశారు, మోహ‌న్ బాబు ఆయ‌న పెద్ద కుమారుడు విష్ణు క‌న్న‌ప్ప సినిమా విడుద‌ల చేశారు.

కన్నప్ప చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.ఈ సినిమాలో విష్ణు తనయుడు మంచు అవ్రామ్ వెండితెరకు పరిచయం అయ్యారు.ఈ స‌మ‌యంలో క‌న్న‌ప్పలో సినిమాలో అవ్రామ్ న‌ట‌న‌కు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ప్రత్యేక అవార్డు లభించింది.

ఈ స‌మ‌యంలో అవ్రామ్ త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు, దీనికి ఆయ‌న బాబాయ్ మనోజ్ స్పందించారు.

ఈ అవార్డు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్లీ మీ ముందుకు వస్తా అంటూ
అవ్రామ్ తెలియ‌చేశాడు. ఈ అవార్డు రావ‌డం పై మ‌నోజ్ ప్ర‌శంస‌ల‌తో పోస్ట్ పెట్టారు.

Also Read  ICC Women’s Cricket World Cup 2025: Full Schedule, Teams, Venues & Key Matches


అవ్రామ్‌ను అభినందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.కంగ్రాట్స్ అవ్రామ్ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి అని తెలిపారు.

అంతేకాదు నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్‌బాబుగారితో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం అంటూ మ‌నోజ్ అన్నారు ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వీడియో వైర‌ల్ అవుతున్నాయి.

మంచు అభిమానులు ఇన్నాళ్ల‌కు వీరి మ‌ధ్య గొడ‌వ‌లు స‌ర్దుమ‌ణిగాయి అని ఆనంద‌ప‌డుతున్నారు. ఇలాగే మంచు బ్ర‌ద‌ర్స్ క‌లిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. అంద‌రికి అదే క‌దా కావాల్సింది, గొడ‌వ‌ల‌తో ఏం క‌లిసి వ‌స్తుంది. న‌లుగురితో చ‌క్క‌గా కుటుంబం ఉంటే అదే ఎంతో ఆనందం.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...