ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్దితి. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. గత నెలలో ఆయన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా ఆయన సతీమణి రుక్మిణీగారు కన్నుమూశారు. భర్త దూరం అవ్వడంతో కొన్ని రోజులుగా ఆమె కూడా తీవ్ర వేదనలో ఉన్నారు. చివరకు ఆమె ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
నెల రోజుల్లో రెండు విషాదాలు జరగడంతో సినిమా పరిశ్రమ, ప్రజలు, అభిమానులు ఎంతో బాధలో ఉన్నారు.
కోటా శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల్లోనే ఆయన భార్య రుక్మిణి కన్నుమూశారు. కోటగారు జూలై 13 వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన భార్య నెల రోజుల తర్వాత ఆ వేదనతో అనారోగ్యంతో కన్నుమూశారు అని తెలుస్తోంది.
ఇద్దరు పార్వతి పరమేశ్వరుడిలా ఉండేవారు, వారి వివాహ బంధం సుమారు 57 ఏళ్లుగా కొనసాగింది. భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. రుక్మిణిగారి వయస్సు 75 సంవత్సరాలు. 1968లో ఆయనకు రుక్మిణిగారితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆయన కొడుకు పేరు కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు మరణించారు.
కోటగారి కుటుంబంలో ఈ విషాద వార్త విని చిత్ర పరిశ్రమతో పాటు, అభిమానులు కుటుంబ సభ్యులు కూడా కన్నీటిపర్యంతం అవుతున్నారు.