Saturday, January 31, 2026
HomeNewsAndhra Pradeshమాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం

Published on

వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కన్నబాబు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.

కురసాల సత్యనారాయణ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డ‌టంతో హైద‌రాబాద్ లోని ప్రైవైట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ట్రీట్మెంట్ అందించారు. అయితే ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో కాకినాడలోని నివాసంలో ప్రాణాలు కోల్పోయారు.

కుర‌సాల క‌న్న‌బాబు రాజ‌కీయంగా ఎంత పేరు పొందారో తెలిసిందే, ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.

ఇక క‌న్న‌బాబు తండ్రి కురసాల సత్యనారాయణ గతంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. ఆయ‌న మ‌ర‌ణంతో పెద్ద‌ ఎత్తున వైసీపీ నేత‌లు స్ధానిక నాయ‌కులు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు వ‌చ్చి ఆయ‌న భౌతిక‌కాయానికి నివాళి అర్పించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. క‌న్న‌బాబు జ‌ర్న‌లిజం వృత్తిగా ఆయ‌న కెరియ‌ర్ మొద‌లు పెట్టారు. 18ఏళ్లు ఆయ‌న జ‌ర్న‌లిస్ట్ గా సేవ‌లంచించారు, త‌ర్వాత మెగాస్టార్ పై అభిమానంతో ప్ర‌జారాజ్యంలో చేరారు.

Also Read  Kerala HighCourt Case: రెండో పెళ్లికి ముందు తొలి భార్యకు అనుమతి తప్పనిసరి!

2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ప్ర‌జారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన త‌ర్వాత ఆయ‌న 2014 వ‌ర‌కూ కాంగ్రెస్ లో ఉన్నారు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కన్నబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజ‌కీయంగా చాలా ఆలోచ‌న చేశారు, చివ‌ర‌కు ఆయ‌న జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరి వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు.

2016లో వైఎస్సార్‌సీపీలో చేరి 2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
జ‌గ‌న్ కు న‌మ్మ‌ద‌గిన వ్య‌క్తిగా జిల్లాలో పేరు సంపాదించారు.

జ‌గ‌న్ ఆయ‌నకు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు .2024 ఎన్నికల్లో మళ్లీ కాకినాడ రూరల్ నుంచి వైెసీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు.
కన్నబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవిలో ఉన్నారు. విజ‌య‌సాయిరెడ్డి పార్టీ వీడ‌టంతో ఆ ప‌ద‌వి క‌న్న‌బాబుకి అప్ప‌గించారు జ‌గ‌న్..

Also Read  ముగిసిన ‘పంచాయతీ’… ఎవరికెన్ని స్థానాలు?


క‌న్న‌బాబు తండ్రి మ‌ర‌ణించారు అనే వార్త తెలిసి పార్టీ నేత‌లు స్ధానికులు సంతాపం తెలియ‌చేస్తున్నారు.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...