రెబల్ స్టార్ ప్రభాస్ మన దేశంలో స్టార్ హీరో అనే చెప్పాలి, అన్నీ వరుస పాన్ ఇండియా సినిమాలతో జోరుమీద ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది, అన్నీ వందల కోట్ల బడ్జెట్ సినిమాలతో అభిమానులని అలరిస్తున్నాడు. అయితే ప్రభాస్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పది మందికీ సాయం చేసే గుణం, తన అనుకున్న వారి కోసం ఎంతవరకూ అయినా వెళతాడు ప్రభాస్, ఇక ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బీజీగా ఉన్నాడు.
అయితే ఫ్యాన్స్ కి మాత్రం ప్రభాస్ రానున్న సినిమా రాజాసాబ్ పై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ సినిమా చేశారు. ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. అయితే సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమా తర్వాత మరో మూడు భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు ప్రభాస్.
తాజాగా ప్రభాస్ గురించి ఓ తమిళ నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన తనకు జరిగిన సంఘటన గురించి తెలియచేశారు. ప్రభాస్ తమకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడని ఆయన అంత మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు నిర్మాత. ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా అరుదు అనే విషయం కూడా చెప్పారు నిర్మాత.
ప్రభాస్ నటించిన సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుస గా ఫ్లాప్స్ వచ్చాయి.అయితే తన వల్ల నిర్మాత
నష్టపోకూడదు అని తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారట.ఈ రోజుల్లో ఇలా ఏ హీరో కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు. కానీ ప్రభాస్ మాత్రం తనపై నమ్మకంతో అంత సినిమా తీసినందుకు తన వంతు బాధ్యత తీసుకున్నాడట.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ అభిమానులు కూడా పెదవి విరిచారు. ప్రభాస్ రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అయితే సినిమా నిరాశపరచడంతో రూ. 50కోట్లు తిరిగి ఇచ్చేశారు అని, నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ కు ఇవ్వాలని కోరాడట ప్రభాస్.. ఆనాడు జరిగిన సంఘటన గురించి ఆ నిర్మాత తెలిపారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ మంచి మనసు గురించి ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.