Tuesday, October 21, 2025
HomeNewsCinemaఫౌజీ లీక్స్ - షూటింగ్ లో ప్ర‌భాస్ ఫోటోలు లీక్స్ ..

ఫౌజీ లీక్స్ – షూటింగ్ లో ప్ర‌భాస్ ఫోటోలు లీక్స్ ..

Published on

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ త‌దుప‌రి చిత్రం రాజాసాబ్ ఈ సినిమాకి విప‌రీత‌మైన బ‌జ్ క్రియేట్ అయింది, దాంతో పాటు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఫౌజీ సినిమా గురించి కూడా అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు, ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఫౌజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు, వీడియోలు కూడా ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. ఇక పోస్ట‌ర్లు అభిమానులు అనేక ర‌కాల డిజైన్ల‌తో చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు.

ఇప్ప‌టికే ఒక ఫోటో లీక్ అయి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది, ప్ర‌భాస్ అభిమానులు ఈ ఫోటో చూసి ఇందులో ప్ర‌భాస్ ఏం రోల్ చేస్తున్నారా అని చ‌ర్చించుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ పీరియాడిక్ వార్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ ఫౌజీ సినిమా. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ కి సంబంధించిన లుక్‌ లీకైంది.

Also Read  War 2 vs Coolie: ధియేట‌ర్లు ఎవ‌రికి ఎన్ని ?

ఈ లుక్ చూసి ప్ర‌భాస్ అభిమానుల్ వావ్ అదిరింది అంటున్నారు, సోష‌ల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తోంది.
ఇందులో ప్రభాస్ చాలా హ్యాండ్స‌మ్ లుక్ లో ఉన్నాడు, స‌న్నివేశానికి సంబంధించి షూటింగ్ లో ఇది ప్రిపేర్ అవుతున్న పిక్, లేదా ఎదుటి వ్య‌క్తికి డైలాగ్ చెప్పే స‌మ‌యంలో తీసిన పిక్ అని తెలుస్తోంది. తన ట్రేడ్‌మార్క్ క్లాస్ అప్పీల్‌తో అభిమానులను ఆకర్షిస్తున్నాడు.

ఈ లీక్స్ బెడ‌ద అయితే సినిమా యూనిట్ల‌కు ఇబ్బంది క‌లిగిస్తుంటే, ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ ట్రీట్ అంటున్నారు.
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో సుమారు రూ.600 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తోంది. ఇక బిఫోర్ ఇండిపెండెన్స్ క‌థ ఇందులో భాగం అని తెలుస్తోంది. స్వాతంత్య్రానికి ముందు క‌ధ కూడా ఇందులో ఉండ‌నుంది అని టాక్.. ఫ్లాష్ బ్యాక్ లో సాయిప‌ల్ల‌వి ఆయ‌న‌కు జోడిగా క‌నిపిస్తుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి

మధురై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఇప్ప‌టికే స‌గం షూటింగ్ పూర్తయింది, ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి జయప్రద వంటి స్టార్ న‌టులు భాగ‌మ‌య్యారు. ప్ర‌భాస్ న‌టించిన ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న విడుదల కానుంది.

Also Read  నాకు వాళ్లు అన్యాయం చేశారు ఆ రోజు అన్నీ తెలియ‌చేస్తా - యాంక‌ర్ ఉద‌యభాను

Latest articles

Mandaadi:సుహాస్ నటిస్తున్న మండాడి సెట్స్‌లో షాకింగ్ ఇన్సిడెంట్!

తెలుగు యాక్టర్ సుహాస్ ఇటీవల ఒక కొత్త తమిళ సినిమా "మండాడి"లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని...

Polimera 3: సత్యం రాజేష్ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి రెడీ!

ప్రముఖ నటుడు సత్యం రాజేష్ హీరోగా నటించిన “పొలిమేర” సిరీస్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది....

Rashmika Mandanna:రక్షిత్ శెట్టి నుంచి విజయ్ దేవరకొండ వరకు.

దక్షిణాది సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతున్న విషయం రష్మిక మందన్న వ్యక్తిగత జీవితం. ఆమె కెరీర్‌తో పాటు...

AA22:అల్లు అర్జున్ – అట్లీ సంచలన కలయికతో AA22 హాలీవుడ్ స్థాయిలో!

'పుష్ప 2' వంటి అద్భుతమైన బ్లాక్‌బస్టర్ తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం...

Deepika Padukone: కల్కి 2 నుంచి దీపికా తప్పుకోవడానికి వెనుక ఉన్న కథ ఇదే!

ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "కల్కి 2898 AD" సినిమా ఈ ఏడాది భారీ విజయాన్ని సాధించింది. నాగ్...

తేజ సజ్జ కొత్త సినిమా మిరాయిలో ప్రభాస్ మ్యాజిక్ – ఫ్యాన్స్‌లో హంగామా

సినిమా ఇండస్ట్రీలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జ, నేటి తరుణంలో ప్రత్యేకమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల...

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....