ఆగస్టు 27 బుధవారం రోజున వినాయక చవితి పండుగ దేశమంతా ఆ గణపతి పూజ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఏడాది మరింత శోభగా చేస్తున్నారు వినాయకచవితి ఉత్సవాలు.
ముంబై ఇప్పటికే గణపతి మండపాలతో సిద్దం అయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణపతి మండపాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది విగ్రహలు సిద్దం అయ్యాయి.
మరి విగ్రహాల తయారీలో ఈ సారి కూడా చాలా మోడల్స్ తో వినాయక విగ్రహాలు తయారయ్యాయి. ఇప్పటికే 20 వేల కేజీల బెల్లంతో వినాయక విగ్రహాన్ని మన తెలుగు స్టేట్స్ లో తయారు చేశారు.
పూర్తి రుద్రాక్షలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడు విశాఖలో భారీ గణనాధుని విగ్రహాలు సిద్దం అవుతున్నాయి.
అయితే మనం వినాయకుడి విగ్రహాన్ని చూడగానే ఆయన చేతిలో ప్రసాదంగా లడ్డు కనిపిస్తుంది.
ఇన్ని ప్రసాదాల్లో లడ్డు ప్రసాదమే వినాయకుడి విగ్రహాల్లో చేతిలో ఎందుకు పెడతారు అనేది ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? గణపయ్యకు నైవేద్యంగా లడ్డూ ప్రసాదమే పెట్టడం వెనుక ఓ కథ ఉంది.
ఆ స్వామికి లడ్డులు అంటే చాలా ఇష్టం, ప్రతీ రోజు ఆయన లడ్డు లేకుండా భోజనం చేసేవారు కాదు.
అంతేకాదు కార్తికేయుడికి వినాయకుడికి ఒకసారి పోటి పెట్టారు పార్వతి పరమేశ్వరులు. ఈ సమయంలో కార్తికేయ తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టేస్తే, వినాయకుడు మాత్రం శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. తల్లిదండ్రులే తన ప్రపంచమని చెబుతాడు. ఆ తర్వాత వారికి మెక్కిన గణపయ్యకు లడ్డు ప్రసాదంగా శివపార్వతులు ఇచ్చారని అంటారు.
అందుకే గణపతి ఆలయాల్లో విగ్రహాల్లో చేతిలో లడ్డులు పెడతారు. అంతేకాదు నిమజ్జనానికి ముందు ఆ లడ్డుని భక్తులకి అందచేస్తారు. కొందరు ఆ లడ్డు వేలం పాటలో దక్కించుకుని దానిని తమ ఇంటికి తీసుకువెళ్లి పొలంలో చల్లుతారు. ప్రసాదంగా స్వీకరిస్తారు, వ్యాపారంలో ఉంచుతారు, బంధువులకి ప్రజలకు పంచుతారు.