ఈ హీరోయిన్ టాటు వెనుక ఇంత స్టోరీ ఉందా
ఇన్నీ అవమానాలు ఎదుర్కొందా
సినిమా పరిశ్రమ ఇది ఓ రంగుల ప్రపంచం. వేలాది మంది ఏదో సాధిద్దాం అని వస్తారు. కాని ఒకరు లేదా ఇద్దరు మాత్రమ అనుకున్న స్ధాయికి వెళతారు. పెద్దలు అన్నట్లు గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి సినిమా పరిశ్రమలో. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవరూ అంత సులువుగా అవకాశాలు ఇవ్వరు. ఎన్నో విమర్శలు చీత్కారాలు ఎదుర్కొంటారు.
ఎదుటి వారు ఎన్ని విమర్శలు చేసినా.. తన ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ఇక్కడ నిలబడాలి. అవకాశాల కోసం ఎదురుచూడాలి అప్పుడే మన టైమ్ బట్టి అవకాశాలు వస్తాయి. ఇటీవల ఓటీటీల హవా పెరిగింది. దీంతో బుల్లితెర వెండితెరమీదే కాదు ఓటీటీలో కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. ఎందరో నటీనటులు ఓటీటీ ద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
కొత్త దర్శకులు వస్తున్నారు, సినిమా పరిశ్రమ కూడా పాన్ ఇండియా స్ధాయికి చేరి, అన్నీ సినిమా పరిశ్రమల నుంచి నటీనటులు వస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో మళయాళ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. కొందరు వచ్చిన అవకాశాలతో పై స్ధాయికి చేరుకుంటున్నారు. తాజాగా నిమిషా సజయన్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ఆమె ట్రెండ్ నడుస్తోంది.
తెలుగు తమిళ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.
న్యాచురల్ యాక్టింగ్ తో దూసుకెళ్లిపోతోంది. మేకప్ లేకుండా తన నేచురల్ యాక్టింగ్ తో తెలుగువారికి బాగా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఆమె నటించిన DNA తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ధియేటర్లలో మంచి కలెక్షన్స్ తో పాటు పాజిటీవ్ రెస్పాన్స్ సంపాదించుకుంది.
ఇక ఓటీటీలో కూడా హయ్యెస్స్ వాచ్ అవర్స్ సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా అధర్వ నటిస్తే, అతని భార్య పాత్రలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. ఆమె కేరళ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిమిషా మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది.
తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది.
ఆమె రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. మేకప్ లేకుండా చాలా నేచురల్ గా ఉంటుంది. రీల్ లైఫ్ లో కూడా ఆమె మేకప్ వేసుకోను అని చెబుతుందట. ఆమె సినిమా పరిశ్రమలో అంత సులువుగా రాలేదు. ఆమెకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆమె చామనచాయ రంగు ఉండటంతో ఆమెకి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవకాశాలు ఇచ్చేవారు కాదట.ఈ రంగు సరిపోదు అనేవారట. బాగా కలర్ ఉండాలని చెప్పేవారట. ఈ సమయంలో ప్రతిభ ఉంటే చాలు రంగు అడ్డు కాదు అని నిలబడింది .. ఈ ముద్దుగుమ్మ ఛాతీ పై భాగంలో సూర్యచక్రపు గుర్తుతో ఓ టాటూ ఉంటుంది .ఆత్మవిశ్వాసానికి ప్రతీకగానే తన ఛాతీపై భాగంలో సూర్యచక్రం గుర్తును టాటూగా వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా స్ట్రాంగ్ అనుకోవాలి.