Tuesday, October 21, 2025
Homemoneyబెట్టింగ్ రాయుళ్ల ప‌ని ఖ‌తం...మూడేళ్లు జైలు శిక్ష కోటి జ‌రిమానా...కొత్త బిల్లు ఏం చెబుతుంది?

బెట్టింగ్ రాయుళ్ల ప‌ని ఖ‌తం…మూడేళ్లు జైలు శిక్ష కోటి జ‌రిమానా…కొత్త బిల్లు ఏం చెబుతుంది?

Published on

ఆన్‌లైన్ బెట్టింగ్ ఈ భూతం మ‌న దేశంలో ల‌క్ష‌లాది కుటుంబాల‌ని రోడ్డు పాలు చేసింది. ఈజీ మ‌నికి అల‌వాటు ప‌డ‌టం, చివ‌ర‌కు యువ‌త దీనిని వ్య‌స‌నంగా చేసుకుంటున్నారు. స్దోమ‌త‌కు మించి అప్పులు అవుతున్నారు. దీని వ‌ల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి.

అంతేకాదు కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌రణించారు.తెలంగాణ‌లో ఏపీలో ఈ బెట్టింగ్ జాడ్యం మ‌రింత పెరిగింది. ఆర్దికంగా ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి, క‌న్న‌కొడుకులు భ‌ర్త‌లు క‌న్నుమూయ‌డంతో మ‌హిళ‌లు ఒంట‌రి అవుతున్నారు. పిల్ల‌లు ఆస‌రా లేకుండా న‌లిగిపోతున్నారు.

అయితే ఆన్ లైన్ సిండికేట్ ల‌ని అంతం చేయాలి అని ఎన్నో నెల‌లుగా డిమాండ్ వినిపిస్తోంది. ప్ర‌భుత్వం వీటిని క‌ట్ట‌డి చేయాలి, అంతే కాదు వీటిని పూర్తిగా అంతం చేయాలి అని కోరుకుంటున్నారు జనం.

ఇప్ప‌టికే మూడు నెల‌లుగా ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేస్తున్న సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయన్స్ ర్ల‌పై, కేసులు న‌మోదు అవ్వ‌డంతో చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. వీరు కోట్ల రూపాయ‌లు ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుని ఈ ప్ర‌మోష‌న్లు చేశారు. వీరిని న‌మ్మి చాలా మంది ఆన్ లైన్ బెట్టింగ్ లో డ‌బ్బులు పొగొట్టుకున్నారు.

Also Read  బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ పై RBI గ‌వ‌ర్న‌ర్ కీల‌క కామెంట్స్..

ఇది ముమ్మాటికి త‌ప్పే దీనిపై పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా వారిపై కేసులు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే స్టేష‌న్ల‌కు కోర్టుల‌కి తిరుగుతున్నారు కొందరు సెల‌బ్రెటీలు. అయితే కేంద్రం దీనిపై మ‌రింత సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటోంది.

శాశ్వత ప్రాతిపదికన గేమింగ్ యాప్స్‌కు చెక్ పెట్టబోతోంది మోదీ సర్కార్. ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది.

ఇది నిజంగా దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును అమల్లోకి తీసుకొస్తోంది.

ఇక ఇది అమ‌లుల‌కి వ‌స్తే ఈ-స్పోర్ట్స్‌కి అధికారిక గుర్తింపు ఉంటుంది. ఇక ఆన్ లైన్ బెట్టింగ్ ఉండ‌దు..వర్చువల్‌గా ఆడే పూర్తి చట్టబద్ధమైన ఎలక్ట్రానిక్ గేమ్స్ ఉంటాయి.

ఇక ఇక్క‌డ ఎలాంటి ఆర్దిక లావాదేవీల‌కి అవ‌కాశం ఉండ‌దు, పేమెంట్ సెక్ష‌న్ అస్స‌లు క‌నిపించ‌దు, అమౌంట్ పెట్ట‌డం విత్ డ్రా చేయ‌డం ఇలాంటివి ఏమీ ఉండ‌వు. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌కి సంబంధించి ప్రకటనలు, లావాదేవీలు అన్నీ ఆగిపోతాయి. ఇక ఎలాంటి పేమెంట్ చేయ‌కుండా అంతా క‌ట్ట‌డిగా దీనిని రూపొందిస్తారు.

Also Read  UPI కస్టమర్లకు గుడ్ న్యూస్10 ల‌క్ష‌లు పంప‌వ‌చ్చు

ఏదైనా కంపెనీ లేదా ప్ర‌చార‌క‌ర్త ఇలా ఆన్ లైన్ గేమ్స్ ని నిర్వ‌హిస్తే వారికి మూడు సంవ‌త్స‌రాల జైలుశిక్ష‌తో పాటు కోటి జ‌రిమానా విధిస్తారు. కొత్త చ‌ట్టంలో ఇక ఎవ‌రైనా ప్ర‌మోట్ చేస్తే రెండు సంవ‌త్స‌రాలు జైలు 50 ల‌క్ష‌ల‌ జ‌రిమానా క‌ట్టాలి.

ఇక ఏదైనా బ్యాంకు ఆర్దిక సంస్ధ‌లు దీనికి స‌హ‌క‌రిస్తే బ్యాంకు యాజమాన్యాలపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయి. ఇది నిజంగా ఓ మంచి చ‌ట్టం అనే చెప్పాలి . ఆన్ లైన్ గేమింగ్ పై ఫిర్యాదుల కోసం ప్ర‌త్యేకంగా ఓ వ్య‌వ‌స్ధ‌ని కూడా కేంద్రం ఏర్పాటు చేయ‌నుంది.

బిల్లు అమల్లోకి వస్తే డ్రీమ్11, మై11సర్కిల్, విన్‌జో లాంటి బడాసైజు గేమింగ్ కంపెనీలకి ఇక నో రెవెన్యూ అనే చెప్పుకుంటున్నారు నిపుణులు. దాదాపు ఈ మార్కెట్ విలువ 20 నుంచి 30 వేల కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది.

నోట్– ఆన్ లైన్ బెట్టింగ్ క్లోజ్ అయితే మంచిదే, అయితే బ‌య‌ట దొడ్డిదారిన బెట్టింగ్ వ్య‌వ‌హారం న‌డిపే సిండికేట్ ల‌ని కూడా ఆపేయాలి. వారికి కూడా క‌ఠినంగా శిక్ష‌లు వేయాలి.

Also Read  గ్వార్ గమ్ ఎగుమతులపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ – భారత్‌కి పెద్ద నష్టం

లేక‌పోతే ఈ బెట్టింగ్ రాయుళ్లు ప్ర‌జ‌ల‌ని మ‌రింత పీక్కుతినే అవ‌కాశం ఉంటుంది. పోలీసులు వీరిపై క‌చ్చితంగా నిఘా పెట్టాల్సిందే.. ఆన్ లైన్ లేక‌పోతే ఆఫ్ లైన్ బెట్టింగ్ కోసం ఎదురుచూసే గద్ద‌లు ఎన్నో ఉన్నాయి అనేది ప్ర‌భుత్వం ముందు చూపుతో గుర్తించి, ఆ నిర్మూల‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాలి.

Latest articles

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Revolut:భారత మార్కెట్‌లో UPI, Visa సేవలు.

లండన్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ కంపెనీ Revolut త్వరలో భారత్‌లో తన పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనుందని ప్రకటించింది....

cheque clearance: రేపటి నుంచి గంటల్లోనే చెక్ క్లియరెన్స్.

🔴 పాత విధానంలో (అక్టోబర్ 3, 2025 వరకు) చెక్కులు బ్యాచ్‌లుగా (ఉదయం / మధ్యాహ్నం) ప్రాసెస్ అవుతు ఉండేది. క్లియరింగ్...

ఒక్క ల‌క్ష ఉంటే చాలు ఈ బిజినెస్ లో మీకు తిరుగు ఉండ‌దు

ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డి అవ‌స‌రం. అయితే కాంపిటీష‌న్ కూడా అలాగే ఉంటోంది. కానీ ఈరోజు...

ఈ స్కీమ్ లోపెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు డబుల్

మ‌న దేశ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ బ్యాంకుల పోస్టాఫీసు్లో ఏదైనా స్కీమ్ క‌ట్టేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ భ‌ద్ర‌త...

చిరిగిపోయిన క‌రెన్సీ నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా ఇక్క‌డ మార్చుకోండి

క‌రెన్సీకి ఎంతో విలువ ఉంటుంది. అయితే ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మార‌కం లో ఈ కరెన్సీ కూడా చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది....

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....