మలయాళ సినిమాలకు మన తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా ఓటీటీ వల్ల చాలా మంది మలయాళ నటులకి మన వారు ఫిదా అవుతున్నారు.
మంచి కథనం అబ్బురపరిచే స్కీన్ ప్లే, అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే సినిమాలు మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తూ ఉంటాయి. మంచి గ్రిప్పింగ్ ఉండే కథనాలు థ్రిల్లర్ సస్పెన్స్ కాన్సెప్ట్ లకి మలయాళ దర్శకులు పెట్టింది పేరు.
అయితే మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో వస్తుంటాయా అని ఎదురుచూస్తారు, ఎందుకంటే అన్నీ లాంగ్వేజెస్ లో డబ్ చేసి ఈ మూవీలని మన ముందుకు తీసుకువస్తారు.
తాజాగా సూత్రవాక్యం ఇప్పుడు అదే కోవలో వచ్చిన సినిమా .ఇది నిన్నటి నుంచి ఓటీటీలో అదరగొడుతోంది. ఈ మలయాళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురువారం ఆగస్టు 21 ఓటీటీలోకి వచ్చింది.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మంచి రేటింగ్ వచ్చింది. ఇది చాలా డిఫరెంట్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతోంది..
ఈ సినిమా మలయాళంలో ఈ ఏడాది జూన్ 11 న ధియేటర్లో విడుదలైంది.. దీనికి యూజీన్ జోస్ చిరమ్మెల్
దర్శకత్వం వహించారు, ఇందులో చాకో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు..షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కీలక రోల్స్ చేశారు.
తన పోలీస్ స్టేషన్ లోనే ఇంటర్ పిల్లలకి ట్యూషన్లు ఫ్రీగా చెబుతాడు హీరో ..అక్కడే ట్యూషన్లు చెప్పే నిమిష కు దీని వల్ల పోటీ ఎదురు అవుతుంది,
అయితే ఒక కుటుంబం నుంచి ఈ ఆఫీసర్ దగ్గరకు ట్యూషన్ కు ఇద్దరు పిల్లలు వస్తారు. అయితే అన్నయ్య సొంత చెల్లిని వేధిస్తాడు.. ఆ తర్వాత నుంచి ఈ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మనం దీనిని ఓటీటీలో చూడాల్సిందే.