కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి, ఇక ఓటీటీ వచ్చిన తర్వాత చాలా కంటెంట్ ఓటీటీ రీలీజ్ అవుతున్నాయి. చిన్న సైజ్ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు అన్నీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి చాలా వరకూ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా తెలుగులో మరో మిస్టరీ థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.. థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మంచి రేటింగ్ తో దూసుకువెళుతోంది.
చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అవి ఓటీటీలో చూసిన తర్వాత ఈ సినిమా థియేటర్లో చూసి ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతారు.
అయితే అలాంటి సినిమానే బ్రహ్మవరం పీఎస్ పరిధిలో.. ఈ సినిమా గత ఏడాది దియేటర్లలోకి వచ్చింది అయితే చాలా ఆలస్యంగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది
గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి ఈ సినిమాలో లీడ్ రోల్ చేశారు, ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. స్టోరీ లైన్ చూస్తే. చైత్ర స్రవంతి బెల్లంకొండ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
తనని అమితంగా ప్రేమించే అబ్బాయి భర్తగా రావాలి అనుకుంటుంది.ఈ సమయంలో సూర్య కనిపిస్తాడు, అతనితో స్నేహంగా ఉంటుంది. తనలో అన్నీ క్వాలిటీస్ తనకు నచ్చడంతో ప్రేమిస్తుంది. ఇదే సమయంలో పేర్లర్ గా
గౌతమ్ అనే వ్యక్తి స్టోరీ నడుస్తుంది, అతను బ్రహ్మవరం ఎస్ ఐతో వివాదం పెట్టుకుంటాడు, అదే సమయంలో రాత్రి అక్కడ శవం దొరుకుతుంది, ఈ సమయంలో అమెరికా నుంచి చైత్ర బ్రహ్మవరం వస్తుంది, అసలు చైత్రకి గౌతమ్ కి సంబంధం ఏమిటి, ఆ శవం ఎవరిది ఇవన్నీ తెలియాలి అంటే ఈ సినిమా ఓటీటీలో వాచ్ చేయాల్సిందే.