ప్రతీ శుక్రవారం ధియేటర్లలో సినిమాలు విడుదల అవ్వడం తెలిసిందే, అయితే ఈ మధ్య సినారియో మారింది కొన్ని సినిమాలు శుక్రవారం సెంటిమెంట్ నుంచి ఇంకా ముందుకు వస్తున్నాయి. గురువారం విడుదల చేస్తున్నారు, అయితే దియేటర్ విడుదల సినిమాల కంటే ఓటీటి రిలీజ్ సినిమాలు ఎక్కువ ఉంటున్నాయి, తాజాగా ఓటీటీలో వారానికి పది సినిమాలు అయినా రిలీజ్ అవుతుంటే దియేటర్లో రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి
అందుకే ఓటీటీ ఆదరణ మరింత పెరుగుతోంది. తాజాగా ఈ వినాయకచవితికి ఓ సరికొత్త సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్దం అవుతోంది. జూలై 18న తమిళంలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఆ సినిమా పేరు గెవి.. కోలీవుడ్ యాక్టర్స్ షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో లీడ్ రోల్స్ చేశారు, దయాలన్ ఈ సినిమాకి దర్శకత్వం చేశారు.
తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఫుల్ దియేటర్ రన్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ డేట్ ఇచ్చేశారు.
వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ ప్రకటించింది. బుధవారం ఓటీటీలో ఈ సినిమా సందడి చేయనుంది. కొండచరియలు విరిగిపడటం, సరైన ఆసుపత్రి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం. ఇవన్నీ ఆ ప్రాంతంలో జరుగుతాయి, అయితే అక్కడ ఉన్న ప్రజలు పోలీసులు రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కచ్చితంగా ఈ సినిమా ఓటీటీలో మంచి వాచ్ అవర్స్ పొందుతుంది అంటున్నారు ఓటీటీ ఎక్స్ పర్ట్స్.