Saturday, January 31, 2026
HomeNewsCinemaలోబోకి ఏడాది జైలుశిక్ష - ఏ కేసులో శిక్ష‌ప‌డిందంటే

లోబోకి ఏడాది జైలుశిక్ష – ఏ కేసులో శిక్ష‌ప‌డిందంటే

Published on

టాటు స్పెషలిస్ట్ గా హైద‌రాబాద్ లో అంద‌రికి సుప‌రిచిత‌మ‌య్యారు లోబో.. అయితే బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన‌లేని క్రేజ్ తెచ్చుకున్నారు, బిగ్ బాస్ ఐదో సీజన్ లో కామెడి ఎంట‌ర్ టైనింగ్ ఎంతో జ‌న‌రేట్ చేశాడు లోబో.

మెగాస్టార్ సినిమాలో కూడా న‌టించాడు, ఓ ప‌క్క సినిమా అవ‌కాశాలు మ‌రో ప‌క్క టీవీ షోల‌తో ఫుల్ బిజీ అయ్యాడు లోబో.. అయితే తాజాగా లోబోకి ఓ కేసు విష‌యంలో ఏడాది జైలు శిక్ష ప‌డింది. ఈ వార్త ఆయ‌న అభిమానుల‌కి ఒక్క‌సారిగా షాకిచ్చింది అనే చెప్పాలి.

బిగ్ బాస్ ఐదో సీజన్ షోలో అలరించిన లోబో .. టాటుల‌తో ఎంత పాపుల‌ర్ అయ్యాడో బిగ్ బాస్ హౌస్ లో త‌న ఆట‌తో మాట‌తో గెట‌ప్ తో మ‌రింత పాపల‌ర్ అయ్యాడు..లోబో గ‌తంలో కారు ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఓ ప్ర‌మాదానికి కార‌ణం అయ్యాడు.ఈ కారు ప్రమాదంలో ఇద్దరు మ‌ర‌ణించారు ప‌లువురు గాయ‌ప‌డ్డారు..

Also Read  Indian Military: పాకిస్థాన్ డ్రోన్స్ కూల్చివేత.

ఈస‌మ‌యంలో లోబో కూడా గాయ‌ప‌డ్డాడు. అయితే దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈకేసు విచార‌ణ పూర్తి అయింది. లోబో అలియాస్‌ ఖయూమ్‌ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు విని ఆయ‌న అభిమానులు షాక్ అయ్యారు.

*సంఘ‌ట‌న వివ‌రాలు చూస్తే *
2018 మే 21 వ తేదిని ఓఛాన‌ల్ వారు షూటింగ్ కోసం లోబోని తీసుకువెళ్లారు .. లోబో టీం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం ఇలాంటి ప్ర‌ముఖ ప్రాంతాల్లో షూటింగ్‌ చిత్రీకరించారు.

ఇక తిరుగుప్ర‌యాణంలో వ‌రంగ‌ల్ నుంచి హైద‌రాబాద్ కారులో వ‌స్తున్నారు ఈ టీమ్. ఈ స‌మ‌యంలో కారు లోబో డ్రైవ్ చేస్తున్నాడు. కారు రఘునాథపల్లి మండలం నిడిగొండ ద‌గ్గ‌ర‌కు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది.

ఈ స‌మ‌యంలో కారు వేగంగా వెళుతోంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ కింద‌ప‌డి తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు.. వెంట‌నే స్ధానికులు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లేలోపు వారు ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

Also Read  MicroPhobia:చీమకు భయపడి యువతి ఆత్మహత్య!

ఆటోలో మిగిలిన ప్ర‌యాణికులు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఈ ప్ర‌మాదంలో లోబోకి మిగిలిన వారికి కూడా గాయాలు అయ్యాయి. లోబో ప్ర‌యాణిస్తున్న‌ కారు బోల్తాప‌డింది.. మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏడు సంవత్సరాల విచారణ తర్వాత తాజాగా తీర్పు వ‌చ్చింది. లోబోకి ఏడాది జైలు శిక్ష విధించింది కోర్ట్..

అంతేకాదు రూ.12,500 జరిమానా కూడా విధించారు నిర్ల‌క్ష్య‌పూరిత డ్రైవింగ్ కి ఈ శిక్ష ప‌డింది..లోబోకి శిక్ష ప‌డ‌టంతో ఈ తీర్పు ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

వేగంగా కారు న‌డ‌ప‌టం చాలా ప్ర‌మాదం. దీని వ‌ల్ల ఇద్ద‌రి ప్రాణాలు కూడా కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. గ‌మ్య‌స్ధానానికి త్వ‌ర‌గా చేరుకోవ‌చ్చని వేగంగా కారున‌డిపితే ఇలా అనుకోని ప్ర‌మాదాలు జ‌రిగితే భారీ మూల్యం చెల్లించ‌వ‌లసి వ‌స్తుంది. ద‌య‌చేసి వేగంగా కారు న‌డ‌ప‌డం, నిర్ల్య‌క్షంగా వాహ‌నాలు న‌డ‌ప‌వ‌ద్ద‌ని తెలియ‌చేస్తున్నారు పోలీసులు.

Also Read  Aviva Baig:ప్రియాంకా గాంధీ కుమారుడితో ఎంగేజ్‌మెంట్… ఎవరీ అవివా బెగ్?

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...