Wednesday, March 18, 2026
HomeNewsఅల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం

Published on

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ త‌ల్లి అల్లు కనకరత్నం క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు, అలాగే వ‌యోభారంతో ఇబ్బంది ప‌డుతున్నారు.

ఆమె వ‌య‌సు 94 సంవ‌త్స‌రాలు, ప్ర‌స్తుతం ప్ర‌ముఖ హ‌స్పిట‌ల్స్ లో ఆమెకి ట్రీట్మెంట్ అందించారు. ఈ విషాద వార్త తెలియ‌డంతో మెగా అల్లు కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్ వ‌స్తున్నారు. అల్లు అర‌వింద్ నివాసానికి ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు వ‌స్తున్నారు.

ఇక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు ఇటీవ‌లే ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ అయింది, ప్ర‌స్తుతం త‌న నానమ్మ మ‌ర‌ణ వార్త తెలియ‌డంతో బ‌న్నీ హైద‌రాబాద్ ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరారు, ఇక మ‌రోపక్క మెగాస్టార్ కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా అల్లు అర‌వింద్ నివాసానికి వ‌స్తున్నారు, ఇక చెన్నై నుంచి మెగాస్టార్ కుమార్తె సుస్మిత కూడా హైదరాబాద్ చేరుకుంటున్నారు, ఇక శ్రీజ కూడా ఇప్ప‌టికే చేరుకున్నారు. ఇక అల్లు అర‌వింద్ కుమారులు బాబీ శిరీష్ కూడా ఇక్క‌డే ఉన్నారు.

Also Read  ఫౌజీ లీక్స్ - షూటింగ్ లో ప్ర‌భాస్ ఫోటోలు లీక్స్ ..

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమా షూటింగ్ కోసం మైసూర్ లో ఉన్నారు. ఈ వార్త తెలియ‌డంతో అమ్మ‌మ్మ‌ని క‌డ‌సారి చూసేందుకు ఆయ‌న కూడా హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు.

అల్లు కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా ఆమె మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. సినిమా ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున అల్లు అర‌వింద్ నివాసానికి వ‌స్తున్నారు. క‌డ‌సారి ఆమెకి నివాళి అర్పిస్తున్నారు, సెల్రెటీల తాకిడి ఎక్కువ ఉండ‌టంతో ప‌దుల సంఖ్య‌లో పోలీసులు బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు .. ఈ రోజు తెల్ల‌వారు జామున ఆమె క‌న్నుమూశారు అని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఈ ఏడాది మార్చినెల‌లో ఆమెకి ఆరోగ్యం సీరియ‌స్ అయింది. వెంట‌నే ఆస్ప‌త్రిలో చేర్పించి కొద్ది రోజులు ట్రీట్మెంట్ అందించారు, క‌న‌క‌ర‌త్నం గారు వెంటిలేట‌ర్ పై ఉన్నారు.

అయితే ఆమె కోలుకోవ‌డంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇటీవ‌ల మ‌ళ్లీ కాస్త న‌ల‌త‌గా ఉండంతో ఆమెకి ట్రీట్మెంట్ అందించారు.. కాని విషాదం తెల్ల‌వారుజామున ఆమె ఈ లోకం విడిచారు . మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించారు.

Also Read  నాకు వాళ్లు అన్యాయం చేశారు ఆ రోజు అన్నీ తెలియ‌చేస్తా - యాంక‌ర్ ఉద‌యభాను

కొడుకు అల్లు అరవింద్, అల్లుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి..

ఆమె మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు న‌లుగురు సంతానం వారిలో కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ మరో ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.. రామలింగయ్య 2004లో మరణించిన త‌ర్వాత‌ ఆమె పెద్ద‌గా బ‌య‌ట‌క‌న‌ప‌డ‌లేదు.

అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించారు… ఆమె ఆరోగ్యం ప‌ట్ట అల్లు అర‌వింద్
ఎంతో శ్ర‌ద్ద తీసుకున్నారు.. భ‌ర్త‌ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొంటాను అని చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా ఆనందించారు.

ఆ కార్య‌క్ర‌మానికి ద‌గ్గ‌రుండి అల్లు అర‌వింద్ తీసుకువ‌చ్చారు.
ఇక త‌మ అభిమాన హీరో ఇంట ఇలాంటి విషాదం జ‌ర‌గ‌డంతో అభిమానులు కూడా బాధ‌లో ఉన్నారు, మెగా అల్లు ఫ్యాన్స్ ఆమెకి సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళి అర్పిస్తున్నారు.

Also Read  RBI: ఎటీఎం ఇంటర్చేంజ్ ఫీజులు పెంపు.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...