మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా ఇలాంటి తరహా గాధతో వచ్చిన సినిమా త్రిబాణధారి బార్బరిక్.. చాలా వెరైటీగా ఉంది ఈ టైటిల్ .. దాని వెనుక ఓ కారణం ఉంది
ఘటోత్కచుని కుమారుడైన బార్బరీకునికి యుద్ధవిద్యల్లో ఉన్న ప్రతిభను చూసి దేవతలు ముచ్చటపడి, అతనికి మూడు బాణాలను ప్రసాదించారు. సో ఆ కోవలో ఈ టైటిల్ పెట్టడం జరిగింది, మరి ఈ సినిమా ఏ జానర్ లో తీశారు, సినిమా ఎలా అలరించింది ఓసారి రివ్యూలో చూద్దాం.
ఘటోత్కచుని కుమారుడు బార్బరీకుడుకి వచ్చిన వరం కారణంగా పాండవులకి ఆపద వస్తుంది అని భావించి
కృష్ణుడు బార్బరీకుడిని వధించాడనే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.. ఈ టైటిల్ సినిమాలో పాత్రల బట్టి తీసుకున్నారు.సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్ ఈ సినిమాలో నటించారు.
దర్శకుడు మోహన్ శ్రీవత్స
మారుతి సమర్పణ
వానర సెల్యూలాయిడ్ బ్యానర్
విజయ్ పాల్ రెడ్డి నిర్మాత
స్టోరీ
సైకియాట్రిస్ట్ డా.శ్యామ్ ఖాతు సత్యరాజ్ తన మనవరాలు నిధి మేఘనతో కలిసి ఉంటాడు. ఇలాంటి సమయంలో ఓ రోజు తన మనవరాలు కనిపించకుండా పోతుంది. వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. ఇదే సమయంలో కథలో పేర్లల్ గా ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు రామ్. తనకి పరిచయం అయిన సత్యతో ప్రేమలో పడతాడు. వారి స్నేహితుడు క్రాంతి జూదానికి అలవాటు పడి అప్పులు చేస్తాడు. ఇలా ఎవరి సమస్యల నుంచి వారు బయటపడాలి అని ఓ అవకాశం కోసం చూస్తారు. ఇలాంటి వారికి సత్య రాజ్ ఏం చేస్తాడు, అసలు నిధి ఏమవుతుంది ఆమె ఎందుకు కనిపించకుండా పోతుంది. వీరి సమస్యలు తీరాయా? సత్యరాజ్ వేసిన ప్లాన్ ఏమిటి అనేది తెలియాలంటే కచ్చితంగా వెండి తెరపై సినిమా చూడాల్సిందే.
బార్బరీకుడు త్రిబాణాలతో కురుక్షేత్రంను ఆపగలడని, ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. అయితే ఇది చూసి అందరూ పురాణాల కథ అని అనుకుంటారు కానీ క్యారెక్టర్ ని ఆవిధంగా ఎస్టాబ్లిష్ చేసి సక్సస్ అయ్యాడు దర్శకుడు. ఇక నేరుగా తాత మనవరాలి నుంచి స్టోరీ మొదలైంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్ వేగం పుంజుకుంది. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కనబరిచేలా తీశారు. ముఖ్యంగా ఇంటర్వెట్ సీన్ చాలా బాగుంది.
సత్యరాజ్ ఇన్వెస్టిగేషన్ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది..కేసును ఛేదించే క్రమంలో బార్బరికుడు ఏం చేశాడనేది ఇక్కడ సత్యరాజ్ పాత్రకు లింక్ చేయడం ఆసక్తి కలిగించింది.
ఇక చివరి 20 నిమిషాలు ట్విస్టులు చాలా బాగున్నాయి ..ఉదయ భాను, దేవ్ సన్నివేశాలు బాగున్నాయి.చక్కటి మెసేజ్‌తో ఈ చిత్రాన్ని ముగించిన తీరు కూడా బాగుంది.దర్శకుడు మోహన్ శ్రీవత్స సమాజంలో ఉన్న ఓ సోషల్ అంశాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. అయితే తాతయ్య మనవరాలు మధ్య ఎమోషన్ బాగా క్యారీ చేశారు. అది అందరికి హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఇక సత్యరాజ్ పాత్ర చాలా బాగుంది..మానసిక నిపుణుడిగా శ్యామ్ కత్తు పాత్రకు సత్యరాజ్ న్యాయం చేశారు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయింది .. నిధి పాత్రలో మేఘన నటన బావుంది. ఎక్కువ కథ ఆమె చుట్టూ తిరుగుతుంది.నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
.
ఫైనల్ గా ఈ వారం ధియేటర్లో వచ్చిన ఓ సోషల్ మెసేజ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనే చెప్పాలి
త్రిబాణధారి బార్బరిక్ రివ్యూ