Wednesday, March 18, 2026
HomeOTT Newsఓటీటీలోకి ఓ సూపర్ హిట్ సినిమా

ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ సినిమా

Published on

మ‌న సినిమా ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమాలు అంటే మ‌ల‌యాళంలోనే వ‌స్తూ ఉంటాయి. ప‌ది కోట్ల లోపు బ‌డ్జెట్ తో పూర్తి చేసిన సినిమాలు వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు సాధించిన‌వి ఇటీవ‌ల మ‌నం చూశాం. అంతేకాదు ధియేట‌ర్ ర‌న్ పూర్తి అయిన త‌ర్వాత ఓటీటీలో కూడా మంచి మంచి వాచ్ అవ‌ర్స్ సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు క‌న్న‌డ త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో కూడా ఇలాంటి పందా పెరిగింది. ఇక్క‌డ నుంచి కూడా చాలా చిన్న సినిమాలు సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్నాయి. నిర్మాత‌ల‌కి కాసుల పంట పండిస్తున్నాయి. వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ చిత్రాల కంటే 100 రెట్లు చిన్న సినిమాలు తీయ‌డం మేల‌ని చాలా మంది నిర్మాత‌లు ఆలోచిస్తున్నారు. ఇటీవ‌ల ఓ క‌న్న‌డ సినిమా ఇలాంటి సంచ‌ల‌నం న‌మోదు చేసింది.

సరికొత్త మేజిక్ చేసింది ఈ కన్నడ సినిమా. అదే సు ఫ్రమ్ సో (Su from So). కేవ‌లం 5 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో తీశారు. పెద్ద‌గా ప్ర‌మోష‌న్ చేయ‌లేదు కాని కంటెంట్ ఉంటే సినిమా ఎవ‌రూ ఆప‌లేరు అనేది మ‌రోసారి నిరూపించి, వ‌సూళ్ల ప‌రంగా చ‌రిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా.. తుమినాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి, రామ్ బి శెట్టి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.ఈ చిత్రంలో ఓ కీల‌క రోల్ చేశారు.

Also Read  5 కోట్లు పెట్టితీస్తే 90 కోట్లుఈ సినిమా మిస్ అవ్వ‌ద్దు OTT లో ఎప్పుడంటే?

ధియేట‌ర్ ర‌న్ చాలా వ‌ర‌కూ పూర్తి అయింది. ఇక ఓటీటీ ల‌వ‌ర్స్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా టాక్ దేశ వ్యాప్తంగా వ‌చ్చింది. దీంతో ఇది అన్నీ భాష‌ల్లో ఓటీటీలో రావాలి అని కోరుకుంటున్నారు..ఈ ఏడాది జులై 25న దియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుదలైంది. పెద్ద పబ్లిసిటీ లేకపోయినా 60 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ క‌నిపించింది. పెద్ద సినిమాల‌కు పోటీ ఇచ్చింది.

కర్ణాట‌క‌ రాష్ట్రంలో ఈ సినిమా 75 కోట్లు నెట్ వసూలు చేసింది. దీని బ‌ట్టి అర్దం చేసుకోవ‌చ్చు ఎంత మేర లాభాలు తీసుకువ‌స్తుంది అనేది. మొత్తం గ్రాస్ వ‌సూళ్లు 115 కోట్ల రూపాయ‌లు తీసుకువ‌చ్చింది. ఇక 2025లో చిన్న సినిమాల రికార్డుల్లో వ‌సూళ్ల ప‌రంగా ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచింది. గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఈ సినిమా వ‌చ్చే నెల అంటే సెప్టెంబ‌ర్ 5 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది. అయితే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాక‌పోయినా ఓటీటీ అప్ డేట్స్ లో ఈ వార్త బాగా వినిపిస్తోంది.

Also Read  ఓటీటీలో భయపెడుతోన్న తెలుగు హారర్ సినిమా

క‌థ‌నం
ఈ సినిమా ఓ మధ్య‌త‌ర‌గ‌తి అబ్బాయి ల‌వ్ స్టోరీగా తీశారు. అశోక్ అనే అబ్బాయి ఓ అమ్మాయిని ల‌వ్ చేస్తాడు. ఆమెని క‌ల‌వ‌డానికి ఊరు వెళ‌తాడు. ఈ స‌మ‌యంలో అక్క‌డ వారి నుంచి త‌ప్పించుకునేందుకు త‌న‌కు దెయ్యం ప‌ట్టింది అని అబ‌ద్దం చెబుతాడు. ఇలా చెప్ప‌డం వ‌ల్ల అత‌నికి అనుకోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అక్క‌డ నుంచి సినిమా ట్విస్టుల‌తో ఆస‌క్తిగా ఉంటుంది. కామెడీ, ప్రేమ, డ్రామా అన్నీ ఇందులో మిక్స్ చేశారు.
కంటెంట్ మీద దృష్టి పెట్టి, సరైన కథనంతో మంచి న‌టుల‌ని తీసుకుంటే క‌చ్చితంగా సూప‌ర్ హిట్లు కొట్ట‌వ‌చ్చు అని నిరూపించింది ఈ సు ఫ్రమ్ సో సినిమా.

మ‌రి చూడాలి ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందో. అన్నీ భాష‌ల్లో రావాలి అని మూవీ ల‌వ‌ర్స్ కోరుకుంటున్నారు.

Latest articles

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...

Prabhas Spirit :Netflixతో భారీ డీల్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే భారీ...

Annagaru vastharu:OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో Karthi, Krithi Shetty జంటగా నటించిన Va Vaathiyaar (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా ఇప్పుడు...

Sirai: సినిమా రివ్యూ

సిరై సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే అర్థవంతమైన కథతో ముందుకొచ్చింది. పూర్తిగా సందేశ ప్రధానంగా సాగినా, ఎక్కడా బలవంతంగా అనిపించకుండా...

Rajasaab:ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్...

Dhurandhar Movie:నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసిన చిత్రం 'ధురంధర్'. ఈ సినిమా కేవలం ఒక...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...