ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఎవరి స్ధోమత బట్టీ వారికి డబ్బు అవసరం ఉంటుంది. అయితే ఈరోజుల్లో బయట ఎక్కడైనా అప్పు ముట్టాలంటే చాలా కష్టం. మూడు రూపాయల నుంచి మొదలు నూటికి 10 రూపాయల వడ్డీ వరకూ తీసుకుంటున్నారు. అయినా దానికి నోట్లు తాకట్లు ఇలాంటి కథ చాలా ఉంటుంది. అయితే బ్యాంకుల్లో కూడా ఇలాంటి ప్రాసెస్ లు ఎన్నో ఉంటున్నాయి. ఇక ఉద్యోగస్తులకి వ్యాపారులకి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. కాని సామాన్యులకి చిన్న ఆదాయం పొందేవారికి తక్కువగా లోన్లు ఇస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్లు మైక్రో ఫైనాన్స్ సంస్ధల దగ్గర, బయట పాన్ బ్రోకర్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు.
అయితే ఈ టెక్నాలజీ యుగంలో నగదు పంపడం రిసీవ్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. యూపీఐ సర్వీసులు వచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్లాల్సిన పని తగ్గింది. ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. నోట్ల రద్దు కరోనా ఈ రెండు సంఘటన తర్వాత డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగాయి. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, మనకు అత్యవసర సమయాల్లో కొన్నిసార్లు డబ్బులు అప్పుగా ముట్టవు. ఇలాంటి సమయంలో మీరు ఈ చిన్న ఆలోచనతో సింపుల్ లోన్ పొందవచ్చు. చాలా తక్కువ వడ్డీకి ఈ లోన్ వస్తుంది. మరి అది ఏమిటో తెలుసుకుందాం.
బయట వారు ఎవరూ డబ్బుల విషయంలో సాయం చేయకపోయినా, ఫోన్ పే మాత్రం ఎలాంటి వడ్డీ లేకుండా కొన్ని రోజులపాటు డబ్బును అప్పుగా ఇస్తుంది. వినడానిక ఆశ్చర్యంగా ఉందా ఇదేంటి అనుకుంటున్నారా పూర్తిగా తెలుసుకోండి.
మీకు అత్యవసరంగా ఓ పది వేలు అవసరం ఎవరిని అడిగినా వారు డబ్బులు లేవు అన్నారు, పోనీ ఎవరిని అయినా అడిగి క్రెడిట్ కార్డు ద్వారా తీసుకోవాలని అనుకుంటే వడ్డీ భారీగా ఉంటుంది. వారు కూడా ఇస్తారో లేదో తెలియదు.ఇలాంటి సమయంలో మీరు ఫోన్ పే ద్వారా స్మాల్ లోన్ తీసుకోవచ్చు. మీకు 45 రోజులు ఎలాంటి వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తుంది ఫోన్ పే.. మీకు ఇచ్చిన 45 రోజుల గడువులో కచ్చితంగా తీసుకున్న లోన్ కి సంబంధించి డబ్బులు పే చేయాలి. లేకపోతే మీకు వడ్డి పడుతుంది.
ఈ లోన్ ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం
ఫోన్ పే లో Credit card లైన్ అనే ఆప్షన్ ద్వారా ఈ లోన్ పొందవచ్చు
మీరు ముందుగా ఫోన్ పే యాప్ ఓపెన్ చేయండి
అక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ లో సెల్ఫ్ అకౌంట్ ని క్లిక్ చేయండి
మీ అకౌంట్ చూపిస్తుంది
మేనేజ్ పేమెంట్ పై ప్రెస్ చేయాలి
ఆ పేజ్ ని కిందకి స్క్రోల్ చేయండి
ఇక్కడే క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఇలా క్రెడిట్ కార్డ్ లైన్ ఆప్షన్ క్లిక్ చేయండి
బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి.
ఇందులో మీరు వాడుతున్న బ్యాంకు ఉన్నట్లు అయితే కనిపిస్తుంది
దానిని క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కండి
ఆ బ్యాంకును క్రెడిట్ లైన్ ఆప్షన్కు లింకు చేసుకోవచ్చు.
అలా మీకు ఉన్న లిమిట్ ప్రకారం మీరు నగదుని ఫోన్ పే నుంచి బ్యాంకు అకౌంట్లో వేసుకోవచ్చు
కచ్చితంగా లోన్ తీసుకుంటే గడువు సమయంలో నగదు పే చేయాలి, లేకపోతే భారీగా వడ్డీ పడుతుంది.
ఇది క్రెడిట్ స్కోర్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే వాయిదాలు క్రమం తప్పకుండా పే చేయాలి.
కేవలం అత్యవసర సమయంలో మాత్రమే దీనిని ఉపయోగించుకుని ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకుంటే మంచిది.