మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నఅత్యంత ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర ఈ మూవీ కోసం మెగా అభిమానలతో పాటు సినిమా లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని క్రియేటీవ్ దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫాంటసీగా రానుంది. అయితే ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా షూటింగ్ పలు రకాల వర్క్ పెండింగ్ వల్ల ఈ సినిమా ఆలస్యం అయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా దియేటర్ రైట్స్ గురించి కంటే ఓటీటీ రైట్స్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ సినిమా అంటే అంత హైప్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ ఉంటుంది. అన్నీ సంస్ధలు కూడా ఈ చిత్రం కోసం పోటీ పడుతున్నాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మంచి డబుల్ డిజిట్ ని కోట్ చేస్తున్నాయి. అయితే మేకర్స్ పలు సంప్రదింపులు జరుపుతున్నారట .. తాజాగా నేడు వినిపిస్తున్న టాలీవుడ్ టాక్ ప్రకారం జియో హాట్‌స్టార్ విశ్వంభర హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకున్న రేంజ్ నగదు కోట్ చేయడంతో వారికి ఈ హక్కులు ఇచ్చారు అనే టాక్ నడుస్తోంది. అంతేకాదు నిర్మాతలు కూడా ఈ ఫ్యాన్సీ రేట్ కి చాలా ఆనందించారట. అలాగే ఈసినిమా గురించి దర్శకుడు చెబుతున్న ఒక్కో విషయం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఇటీవల చిరు బర్త్ డేకి విడుదల చేసిన కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది
చిరు పుట్టిన రోజు విశ్వంభర ట్రీట్ అభిమానులని ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ ఒక రోజు ముందే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి డైలాగ్స్ అలాగే సినిమా బ్యాగ్రౌండ్ స్టోరీ ఎలా ఉంటుందో అనేది ఓ క్లారిటీ వచ్చింది. ఆధ్యంతం గ్లింప్స్ ఆకట్టుకుంది.
బింబిసార మూవీ ఎలా గ్రాఫిక్స్ తో ఆకట్టుకుందో, ఇది అలాంటి మంచి కంటెంట్ తో సోషియో ఫాంటసీతో ఆకట్టుకుంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కొన ఊపిరితో ఉన్న ఓ సమూహానికి జీవం పోసే నాయకుడిగా చిరంజీవిని ఇందులో పరిచయం చేశారు. ఇందులో చిరు ఎంట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమాలో చాలా సీన్లు గతంలో ఎన్నడూ చూడని రేంజ్ లో ఉండనున్నాయి అంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఓటీటీలో కూడా పోటీ పెరిగింది. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ మూవీ రిలీజ్ పై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా విడుదల తేది ప్రకటించకపోయినా 2026 సమ్మర్ లో
రానుంది అని తెలిపారు మేకర్స్, ముఖ్యంగా స్కూళ్లకు సెలవులు ఉంటాయి పెద్దలకి సమయం ఉంటుంది. అందుకే సమ్మర్ లో ఈ సినిమా ప్లాన్ చేశారు. 2023లోనే మెగా 156ను అనౌన్స్ చేసినా పలు కారణాలతో లేట్ అయింది.
ఇక ఈ దీపావళి లేదా సంక్రాంతికి రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. విశ్వంభర సెకండాఫ్ అంతా గ్రాఫిక్స్‌తోనే ఉండనుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ చాలా టైమ్ పట్టనుంది అంటున్నారు.