Sunday, March 22, 2026
HomeTechnologyజీమెయిల్‌ యూజర్లకు గూగుల్ అల‌ర్ట్

జీమెయిల్‌ యూజర్లకు గూగుల్ అల‌ర్ట్

Published on

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ ఓ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు తమ దాడులను వేగవంతం చేస్తున్నారని.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ప్రారంభించాలని కోరింది.

ఇప్పటికే చాలా మంది ప్రజలు హ్యాకర్స్ బారిన పడ్డారు. షైనీహంటర్స్‌ అనే అంతర్జాతీయ హ్యాకర్స్ ముఠా కూడా దీని వెనుక ఉన్నట్లు గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది. 2020 నుంచి ఏటీ&టీ, మైక్రోసాఫ్ట్, సాంటాండర్‌, టికెట్‌మాస్టర్‌ వంటి కంపెనీల డేటా లీక్ కేసులో ఈ గ్రూప్ ప్రమేయం ఉందని పేర్కొంది. దీనికోసం హ్యాకర్స్ ఫిషింగ్ పద్దతిని ప్రధానంగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

యూజర్లకు ఫేక్ మెయిల్స్ పంపి.. వేరొక లాగిన్ పేజిలోకి మళ్లించడం, తద్వారా సెక్యూరిటీ కోడ్స్ వంటి సమాచారాన్ని దోచుకోవడం హ్యాకర్స్ పని. సెక్యూరిటీ కోడ్స్ హ్యాకర్స్ చేతికి వెళ్తే.. తరువాత జరిగే నష్టాలను అంచనా వేసుకోవచ్చు. షైనీహంటర్స్‌ గ్రూప్ ఒక డేటా లీక్‌ సైట్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది, ఇది సున్నితమైన సమాచారం దోచుకునే అవకాశం ఉందని గూగుల్ ఇప్పటికే ఒక బ్లాగ్‌పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

Also Read  మీ ఫోన్ల‌కి ఛార్జింగ్ పెట్టే స‌మ‌యంలో ఈ త‌ప్పులు చేయ‌కండి.

టూ స్టెప్ వెరిఫికేషన్ ఎందుకంటే?
ఒక ఈమెయిల్‌కు మరింత సెక్యూరిటీ కావాలనుకుంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. హ్యాకర్స్ మీ ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను తెలుసుకున్నప్పటికీ.. టూ స్టెప్ వెరిఫికేషన్ లేకుండా లాగిన్ అవ్వలేరు. ఇది మీకు సంబంధించిన ఈమెయిల్‌లోని సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్స్ భారీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సులువైన మార్గం.

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

GROK APP: తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్..

SMలో గ్రోక్ AIతో మొదలైన బికినీ ట్రెండ్‌ భారతీయులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న...

Elon Musk Starlink: ఇండియా ధరలు ఎంతో తెలుసా..?

ఎలాన్ మస్క్‌ వ్యవస్థాపించిన SpaceX సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ Starlink ఇప్పుడు భారత...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...