సీనియర్ నటి ఆమని, కొమరక్క కీలక పాత్రలతో తెరకెక్కిన సినిమా బ్రహ్మండ. ఈ సినిమా దాసరి సునీత సమర్పణలో దర్శకుడు రాంబాబు తెరకెక్కించారు. అత్యంత విషాదం ఏమిటి అంటే ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు తెరపై ఆయన సినిమా చూసుకోకుండానే కన్నుమూశారు. ఇది చాలాబాధాకరం. ఈ ఘటన అందరిని తీవ్ర విషాదంలో నెట్టింది. ఇక ఈ సినిమా విడుదల సమయంలో మంచి బజ్ కనిపించింది. మరి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
దాసరి సునీత సమర్పణ
దర్శకుడు రాంబాబు దాసరి
వరికుప్పల యాదగిరి సంగీతం
రమేష్ రాయ్, జిఎస్ నారాయణ సంభాషణలు
స్టోరీ
అది ఇచ్చోళ అనే గ్రామం అక్కడ మిస్టరీగా రాత్రి 12 గంటలకు హత్యలు జరుగుతాయి. ఇలా వరుస హత్యలు ఆ గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తాయి. అసలు గ్రామంలో ఇలా రాత్రి హత్యలు జరగడం జనాలు బయటకు రావడానికి వణికిపోతారు. అసలు గ్రామంలో ఇలా వరుస హత్యలు జరగడం పై పోలీసులు షాక్ అవుతారు. విచారణ చేస్తారు కాని వారికి ఈ హత్యల కేసులు సవాలుగా మారతాయి. ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరూ బయట తిరిగవద్దు అని దండోరా వేయిస్తారు. ఏడాదికి ఓసారి జరిగే మల్లన్న జాతర కూడా రద్దు చేయాలి అని భావిస్తారు. అసలు ఎన్నడూ లేనిది గ్రామంలో ఈ వరుస హత్యలు ఏమిటి, దీని వెనుక ఎవరు ఉన్నారు, చివరకు ఈ కేసులు ఎలా సాల్వ్ అయ్యాయి, పోలీసులు ఈ మిస్టరీని చేధించారా అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
గతంలో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే దర్శకుడు మిస్టరీని తర్వాత ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ ని ప్రేక్షకుల్లో కలిగేలా చేయడం. పరిచయం చేస్తున్న పాత్రలని అనుమానించేలా చేయడం ఇలా దర్శకులు తమ మార్క్ చూపించారు. ముఖ్యంగా దర్శకుడి ప్రతిభ ఇక్కడ కీలకం అనే చెప్పాలి. గతంలో తెలుగులో ఇలాంటి స్టోరీలు చాలా వచ్చాయి. కొన్ని మాత్రమే సక్సస్ అయ్యాయి. అయితే బ్రహ్మండ కూడా అలాంటి సినిమా అనే చెప్పాలి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తీసిని సినిమా ఇది.. గ్రామీణ నేపథ్యానికి సస్పెన్స్, క్రైమ్, ఆధ్యాత్మికత జోడించి ఈ చిత్రాన్ని ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చేశారు డైరక్టర్.
మల్లన్న, బీరప్ప స్వాములకు సంబంధించిన పూజా విధానాలు వారి ఆచార సంప్రదాయాలను, తెరపై చూపించి ప్రేక్షకులకి కొత్త విషయాలు తెలిసేలా చేశారు.ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ రెండు సినిమాకి పెద్ద అసెట్స్ అయ్యాయి. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి, ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్ అనిపించింది.
సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
ఆమని ఈ మధ్య కాలంలో చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. బలగంలో నటించిన జయరామ్ కూడా తన పాత్రలో చాలా బాగా చేశారు. ఇక సినిమాకి కొమరక్క పాత్ర పెద్ద ఆస్దిగా నిలబెట్టింది. చాలా బాగా చేసింది.
ఛత్రపతి శేఖర్ తనదైన సహజ నటనతో మెప్పించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.
గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. పల్లె గ్రామీణ పద్దతులు చాలా వరకూ టచ్ చేశారు.
ఫైనల్ గా చెప్పాలంటే మిస్టరీ టచ్‌తో సాగిన గ్రామీణ నేపథ్యం ఉన్న కథ బ్రహ్మండ.