తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా మదరాసి. ఈ సినిమాపై కొన్ని నెలలుగా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్య మురగదాస్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. మరి ఈ యంగ్ హీరోతో ఎలాంటి సినిమా చేస్తున్నారా అని అందరూ ఎదురుచూశారు. తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 5 న విడుదల కానుంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మించారు. ముంబై నటుడు విద్యుత్ జమ్వాల్, మలయాళ నటులు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కీలక రోల్స్ చేశారు. అయితే ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి మరి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
తమిళనాడులో సౌత్ – నార్త్ ఇండియా ఇలా2 మాఫియా సామ్రాజ్యాలు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య జరిగే యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాలో ఆ గ్రూపుల వల్ల బాధించబడతాడు రఘు, అతనే హీరో శివకార్తికేయన్. చివరకు ఆ గ్రూపుని ఎలా ఎదిరించాడు, అతనికి జరిగిన అన్యాయం ఏమిటి. ఇవన్నీ అంశాలతో సరికొత్తగా దర్శకుడు మురగదాస్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాతో మురగదాస్ మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అంటున్నారు అందరూ.అంతేకాదు శివకార్తికేయన్ నటన కూడా చాలా బాగుంది అంటున్నారు
ఈ సినిమాకి మరో హైలెట్ అనిరుధ్ రవిచందర్ సంగీతం. ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది.అలాగే శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా మంచి సీన్లతో అదిరిపోయింది అంటున్నారు. సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫి రిచ్ లుక్ తో ప్రతీ సీన్ కనిపించింది. ఇక నిర్మాణ వ్యయం భారీగానే అయింది ఎక్కడా కూడా వెలితి లేకుండా రిచ్ లుక్ తో కనిపించింది.ఈ సినిమా గజని సినిమా మాదిరిగా రివేంజ్ డ్రామా అనే టాక్ వచ్చింది.
లవ్ యాక్షన్ ప్రతీకారం, ఎమోషన్ గా సాగింది.
ఇక ఫస్టాఫ్ లవ్ యాక్షన్ మిళితమైంది అని సెకండాఫ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో దీనిని దర్శకుడు మలిచాడు అంటున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ చాలా బాగా నటించారు.హీరోకు ఓ ట్రాజెడీ బ్యాక్ స్టోరీని చాలా కన్విన్సింగ్ గా ఎమోషనల్ గా దర్శకుడు చూపించారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఓ పెద్ద పిల్లర్ గా నిలిచింది. డీసెంట్ సినిమాటోగ్రఫి, బీజీఎం, సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ లతో మురగదాస్ దీనిని ముగించారు.
గతంలో మురగదాస్ మాట్లాడుతూ అసలు ఈ టైటిల్ ఎందుకు మదరాసి అని పెట్టారో చెప్పారు.ఈ సినిమా కథ తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్ అలా పెట్టాం. నేను బెంగళూరులో కథ జరుగుతుంటే ఇలాంటి పేరు పెట్టలేను కదా అని తెలిపారు, అంతేకాదు స్టోరీ కూడా ఇక్కడ తీసినా అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది అని అన్నారు, అలా పర్పెక్ట్ సెట్ అయింది ఈ సినిమా స్టోరీ.
మొత్తానికి చాలా కాలం తర్వాత ఓ మంచి యాక్షన్ సోషల్ మెసేజ్ కాన్సెప్ట్ మూవీగా దీనిని మురగదాస్ తెరకెక్కించారు అనే టాక్ వస్తోంది అమెరికా నుంచి.