FMCG Fast-Moving Consumer Goods ఈ రంగంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలు మన దేశంలో ఉన్నాయి, అయితే పతంజలి కూడా అందులో ఒకటి. చాలా చిన్నగా స్టార్ట్ అయిన ఈ కంపెనీ దేశం అంతా పేరు పొందింది. దేశంలో నలుమూలలా ఈ కంపెనీ ప్రొడక్టులు దొరుకుతున్నాయి. పతంజలి అంటే ఓ బ్రాండ్ గా ఏర్పడంది. దానికి కారణం బాబా రామ్ దేవ్. ఈ కంపెనీ స్దాపించడం, ఆయన అభిమానులు భక్తులు ఫాలోవర్స్ కూడా మౌత్ పబ్లిసిటీతో దీనికి మరింత ప్రాచుర్యం తీసుకువచ్చారు. MMC రంగంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది పతంజలి కంపెనీ.
ఇక పేస్టులు సోప్స్ తేనె ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఔషదాలు కూడా పతంజలి అందిస్తోంది. దంత్ కాంతి, అలోవెరా, వ్యవసాయ ఉత్పత్తులు తినదగిన నూనెల వ్యాపారం కొన్నిరకాల తినుబండారాలు కూడా అందిస్తోంది ఈ కంపెనీ. అంతేకాదు పతంజలి షేర్ మార్కెట్లో లిస్ట్ చేయబడింది. అయితే ఈ కంపెనీలో షేర్లు కొన్న వారు అందరూ లాభపడ్డారు తప్ప నష్టపోలేదు. ధర పెరుగుతూనే ఉంది ఈ కంపెనీ షేర్లు ఐదు సంవత్సరాల్లో దాదాపు 72 శాతం రాబడిని ఇచ్చాయి. 5 ఏళ్ల క్రితం కంపెనీ షేరు విలువ రూ.1040 ఉండగా తాజాగా 1784 కి చేరింది అంటే సుమారు 743 రూపాయలు పెరిగింది.
BSEలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 64,758 కోట్లుగా ఉంది. అంతేకాదు వందల రకాల ప్రొడక్టులు పతంజలి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, అన్నింటికంటే పతంజలి ఆయిల్ వ్యాపారం మొదటి స్ధానంలో ఉంది. లాభాల్లో కూడా 30 శాతం తినదగిన వంట నూనెల నుంచి వస్తోంది. ఇక ఈ కంపెనీ ఉత్పత్తులు వ్యాపారం ప్రతీ ఏడాది పెరుగుతోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు.
- పతంజలి ఆహార ఉత్పత్తులు *
చర్మ సౌందర్య రక్షణ ప్రొడక్టులు
తేనే
నెయ్యి
పిండి పదార్దాలు
మూలికలు
ఆయుర్వేద ఔషదాలు
నూడుల్స్, బిస్కెట్లు
రసగుల్లా
గులాబ్ జామున్
టూత్‌పేస్ట్, సబ్బు, నూనె షాంపు ఉత్పత్తులు మేజర్ వాటా కలిగి ఉన్నాయి సేల్స్ లో
పతంజలికి దేశవ్యాప్తంగా 47,000 కంటే ఎక్కువ రిటైల్ దుకాణాలు ఉన్నాయి
చైన్ లింక్ అంటే డిస్ట్రిబ్యూటర్లు స్టాకిస్టులు సుమారు 3500 మంది ఉన్నారు
18 రాష్ట్రాల్లో వేర్ హౌసెస్ ఉన్నాయి పతంజలికి.
పతంజలి కంపెనీ ఉత్పత్తులు సుమారు 1000 వరకూ ఉంటాయి
1000 ఎకరాల్లో హరిద్వార్‌లోని పతంజలి ప్రధాన కార్యాలయ ప్రాంగణం ఉంటుంది
200 మంది శాస్త్రవేత్తలు నిరంతం కొత్త ఉత్పత్తుల అన్వేషన చేస్తారు
10 దేశాలకు పతంజలి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి
హరిద్వార్‌లో పతంజలి ప్రాంగణంలో 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి