ఈ మధ్య ఓటీటీ కంటెంట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఏ కొత్త సినిమా వచ్చినా వదిలిపెట్టడం లేదు.
లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయి సూపర్ వాచ్ అవర్స్ సంపాదించుకుంది ఇన్స్పెక్టర్ ఝండే మూవీ. నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో మనోజ్ బాజ్ పాయి అలాగే రీసెంట్ కుబేర విలన్ జిమ్ షర్బ్ ఇద్దరు నటించారు. ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. తెలుగు వారికి కూడా ఈ సినిమా బాగా నచ్చుతోంది, మరి ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా ఇన్స్పెక్టర్ ఝండే ఎలా ఆకట్టుకుంటుంది అనేది ఓసారి చూద్దాం.
కాస్ట్ & క్రూ – మనోజ్ బాయ్ పాయి, జిమ్ షర్బ్, విజయ ఓక్, సచిన్ ఖేడేకర్
దర్శకుడు చిన్మయ్ డి మండలేకర్
నిర్మాత ఓం రౌత్
సంగీతం : సంకేత్ సేన్,
ఈ సినిమా గురించి చెప్పాలంటే నిజ జీవితంలో జరిగే కొన్ని ఘటనల ఆధారంగా దర్శకుడు కొన్ని కల్పిత అంశాలను కలిపి తెరపై చూపించారు.1986 ముంబై పోలీస్ అంటే అప్పటి గూండాలకి వణుకు ఉండేది. ఆ ట్రీట్మెంట్ శిక్షలు ఇంటరాగేషన్ వేరే లెవల్ ఉండేది. అలాంటి సమయంలో ఓ పేరు మోసిన రౌడీ ఏకంగా 30 మందిని చంపిన కిల్లర్ కార్ల్ భోజ్ రాజ్ తీహర్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతన్ని మొదటిగా పట్టుకున్న ఆగ్రిపడ పోలీస్ మనోజ్ బాజ్ పాయ్ టీమ్ ఈ కేసుని చాలా సీక్రెట్ గా ఇంటరాగేషన్ చేస్తుంది. డిజీపీ ఈ టీమ్ ఇంటరాగేషన్ పూర్తి చేసిన తర్వాత ఆ ఫైల్ అందిస్తారు. అక్కడ నుంచి ఝండే టీం ఏం చేశారు. ఈ కిల్లర్స్ ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సినిమా స్టోరీ..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
ఈ సినిమా ఇంటరాగేషన్ సస్పెన్స్ క్రైమ్ యాంగిల్ లో తీసుకువెళ్లారు. ఇంత క్రైమ్ వర్షన్ ఉన్నా చాలా డీసెంట్ గా ఈ సినిమా తెరకెక్కించారు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో అప్పటి పోలీస్ ఇంటరాగేషన్ స్టైల్ ని ఇప్పుడు చూపించారు.
అప్పటి పరిస్థితులు ఆనాటి రోజులు చాలా సహజ సిద్ధంగా దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.
మనోజ్ భాజ్ పాయి నటన అత్యద్బుతంగా ఉంది. ఈ సినిమాలో పోలీసుల ఎమోషన్స్ చాలా బాగా పండించారు.
నటి విజయ ఓక్ భార్యగా పర్ ఫెక్ట్ గా నటించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు సచిన్ ఖేడేకర్ రోల్ చాలా బాగుంది. విలన్ గా జిమ్ షర్బ్ బాగా ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ మనోజ్ తన టీమ్ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో సెకండాఫ్ లో కామెడీ లైన్ బాగుంది.. చెప్పాలంటే కధ బాగుంది కథనం మాత్రం కాస్త స్లో అయింది సెకండాఫ్ లో.. ఇలాంటి సినిమాల్లో లాజిక్ మిస్ అవ్వకూడదు. కాని రెండు మూడు సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయ్యాయి.
ఇక నిర్మాత ఈ సినిమాకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఖర్చుకి వెనకడుగు వేయలేదు అనేది ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కనిపిస్తోంది.. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సినిమాలో ఇన్వెస్టిగేషన్, కామెడీ సీన్స్ ని బాగా తెరకెక్కించారు. కథనాన్ని ఇంకా ఎంగేజింగ్ గా తీయాల్సి ఉంది, మొత్తానికి ఓటీటీలో మంచి థ్రిల్ అందిస్తోంది ఈ సినిమా.
ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు ఈ సినిమాని