ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అనే చెప్పాలి, ఇప్పటికే వైయస్ కుటుంబం నుంచి దివంగత
సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో ఉన్నారు. ఇక కుమార్తె షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు వైయస్ కుటుంబం నుంచి మూడో తరం కూడా రాజకీయాల్లోకి రానుంది. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలతో దీనిపై నేడు క్లారిటీ అయితే వచ్చింది అని చెప్పుకోవాలి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నారు. ఎందుకంటే నేడు రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్ సందర్శించారు. అంతేకాదు అక్కడ రైతులతో మాట్లాడారు. ఉల్లి ధర ఇంత భారీగా పడిపోవడంతో రైతులతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక రాజారెడ్డి రాజకీయంగా అడుగులు వేయబోతున్నారు అని తాజా రాజకీయ పరిణామంతో క్లారిటీ వచ్చింది. అంతేకాదు తన తల్లి వైయస్ షర్మిల దగ్గర అలాగే అమ్మమ్మ వైయస్ విజయమ్మ దర్గర ఆశీర్వాదం తీసుకుని ఆయన రైతులని కలిశారు.
దీంతో రాజారెడ్డి త్వరలో రాజకీయ అరంగ్రేటంకు ఏర్పాటు జరుగుతున్నాయని ఏపీలో చర్చ జరుగుతోంది. ఇంకా ఏపీలో ఎన్నికలకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది. అయితే యువతని పార్టీకి దగ్గర చేర్చేందుకు, షర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్దలు యువ నాయకుడిని రాజకీయాల్లోకి దించుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కు ఇద్దరు కుమార్తెలు వారు రాజకీయాల్లోకి వస్తారో రారో తెలియదు, ఆ లెగసీ కుమార్తె షర్మిల కుమారుడు తీసుకుంటాడు అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చివరి వరకూ పనిచేశారు. అందుకే రాజారెడ్డిని కూడా కాంగ్రెస్ లో యాక్టీవ్ చేస్తున్నారట.
రాజారెడ్డి బ్యాగ్రౌండ్*
1996 డిసెంబర్‌లో రాజారెడ్డి బ్రదర్ అనిల్ షర్మిల దంపతులకు జన్మించారు.
ఒకసోదరి కూడా ఉంది.
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ స్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశాడు
డల్లాస్ యూనివర్శిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు
తర్వాత ఓ ప్రముఖ ఎమ్ ఎన్ సీ కంపెనీలో ఉద్యోగం చేశాడు
స్కూల్ ఏజ్ నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు రాజారెడ్డి .
చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు
అట్లూరి ప్రియని రాజారెడ్డి గత ఏడాది వివాహం చేసుకున్నాడు.
నా కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తెలిపారు షర్మిల, అంతేకాదు .
అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని తాజాగా షర్మిల కామెంట్ చేయడం పొలిటికల్ గా ఆయన ఎంట్రీ ఉంటుంది అనేది క్లారిటీ వచ్చింది.