ఈ రోజుల్లో చాలా వరకూ యూపీఐ పేమెంట్లు కార్డ్ లెస్ పేమెంట్లు చేస్తున్నాం. కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో ఆ రోజుల్లో అంటే ఓ 10 సంవత్సరాల క్రితం కార్డు పేమెంట్లు ఎంతలా జరిగేవో తెలిసిందే. ముఖ్యంగా డెబిట్ కార్డులు కొన్ని సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో కీలకం అయ్యాయి. తర్వాత క్రెడిట్ కార్డులు వచ్చాయి. అయితే ఎక్కువగా డెబిట్ కార్డుల వాడకం ఉండేది. ఏ సమయంలో అయినా ఎక్కడ ఉన్నా మన చేతిలో డెబిట్ కార్డు ఉంటే మనం ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే వాళ్లం ఇది ఎంతో సౌలభ్యంగా ఉండేది
ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునేవాళ్లం. అయితే ఏటీఎం కార్డులు ఎంత మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారో అంత మందికి ఉంటాయి. అయితే ఈ ఏటీఎం వినియోగం పెరిగిన తర్వాత మోసాలు కూడా పెరిగిపోయాయి. పాపం చాలా మంది పెద్దవాళ్లకు, ఏటీఎం వాడకం రానివారికి సాయం చేస్తామని కొందరు కేటుగాళ్లు ATM సెంటర్ దగ్గర కాపుకాస్తారు. ఆ పిన్ నెంబర్ తెలుసుకుని చివరకు కార్డు దొంగిలిస్తారు. లేదా ఆ కార్డుని ATM మిషన్లో పెట్టి తర్వాత విత్ డ్రా చేస్తారు. ఇలాంటి ఘటనలు రోజు వందల్లో కేసులు నమోదు అయ్యేవి. చివరకు ఈ కేటుగాళ్లు దొరికేవారు కాదు. ఒకవేళ మనం డెబిట్ కార్డుఎక్కడైనా పోగొట్టుకున్నా పిన్ నెంబర్ తెలిస్తే ఇక డబ్బులు పోతాయి, పూర్తిగా అకౌంట్ ఖాళీ చేస్తారు.ఈజీగా అందరికి గుర్తు ఉండే నెంబర్లు లాంటివి ఏటీఎం పిన్ నెంబర్ గా ఎప్పుడూ పెట్టుకోకూడదు.
అయితే ATM పిన్ గా కొన్ని నెంబర్లు అస్సలు ఎట్టి పరిస్దితుల్లో పెట్టకూడదు అని తెలియచేస్తున్నారు టెక్ నిపుణులు.. ఈరోజుల్లో చాలా వరకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి అంటే కచ్చితంగా కస్టమర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియచేస్తున్నారు. ఈ ఏటీఎం కార్డుకి నాలుగు అంకెల పిన్ నంబర్ చాలా కీలకం. అయితే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం నగదుకి ఈ నాలుగు అంకెలు మాత్రమే భద్రత అనేది గుర్తు ఉంచుకోవాలి. అందుకే మీరు పెట్టే పిన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఎవరికి తెలియని నెంబర్ అయి ఉండాలి.
*వాడకూడని పిన్ నంబర్లు చూసినట్లు అయితే *
వరుస క్రమాలు 1.2.3.4. ఇలా నెంబర్ పిన్ పెట్టకూడదు
1111, 2222, 3333, 0000 ఇలా రిపీట్ అయ్యే నంబర్లు వాడకూడదు
ఇక సీక్వెన్స్ నెంబర్లు వాడకూడదు 2.4.6.8
రివర్స్ నంబర్లు వాడకూడదు 4321
ప్యాటర్న్ ఆధారిత కాంబినేషన్లు కూడా వాడకూడదు 1122
ఇక కార్డు హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ పిన్ గా పెట్టకూడదు
ఇవన్నీ సోషల్ మీడియాలో మీరు కచ్చితంగా ఇచ్చి ఉంటారు ఇది ఎప్పటికైనా డేంజర్
అలాగే మొబైల్ లాస్డ్ నెంబర్లు పెట్టకూడదు.
ఇక మీ బైక్ కారు నెంబర్లు కూడా పిన్ గా పెట్టవద్దు.