మనం చూస్తూ ఉంటాం బయట ధియేటర్లలో పెద్దగా సక్సస్ అవ్వని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఓటీటీలో మిలియన్ల వాచ్ అవర్స్ పొందుతూ ఉంటాయి. ముఖ్యంగా మన దేశీయ చలన చిత్ర పరిశ్రమలో ఇలా చెప్పుకోవాలంటే ఓటీటీల ద్వారా దగ్గర అవుతున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.
మలయాళం నుంచి ఎక్కువ ఈ ఓటీటీ సినిమాలు వస్తు ఉంటాయి. ఆ తర్వాత కన్నడ తర్వాత తమిళ్ తర్వాత తెలుగులో వస్తున్నాయి. అయితే ఓటీటీలు వచ్చిన తర్వాత ఏడాదికి ఓసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎప్పుడైనా సినిమా చూడవచ్చు. ఈ సౌలభ్యం కూడా మూవీస్ ని ఇంట్రస్ట్ గా చూసేవారికి చాలా కలిసి వస్తుంది. క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే తాజాగా ఇలా ఓ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది కానీ ఓటీటీలో వావ్ అనిపిస్తోంది వాచ్ అవర్స్ లిస్ట్ లో.. ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో క్రైమ్ కేటగిరిలో టాప్ 3 లో దూసుకుపోతోంది.ఈ సినిమా పేరు గార్డ్ రివెంజ్ ఫర్ లవ్.
కథ
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఒక బిల్డింగ్ చుట్టూ తిరుగుతుంది ఈ కథ. ఇక్కడ రాత్రి పూట ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తాడు, అతని పేరు సుశాంత్, కాని రాత్రి పూట బిల్డింగ్ లో ఎవరూ లేకపోయినా వింత శబ్దాలు వింటాడు.. ఆ సెక్యూరిటీని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ భయంతో అనుమానం వచ్చి సామ్ అనే ఒక డాక్టర్‌ను సంప్రదిస్తాడు. అయితే డాక్టర్ సామ్ సలహాతో అసలు బిల్డింగులో ఏమి ఉంది అని తెలుసుకోవడానికి లోపలికి వెళతారు. కానీ అక్కడ ఇద్దరికి ఊహించని పరిస్దితులు ఎదురు అవుతాయి. ఏకంగా ఓ శక్తి సామ్ ని
ఆవహిస్తుంది.. అంతేకాదు బిల్డింగ్ లోని ఓ ల్యాబ్ లో అమ్మాయిల అస్థిపంజరాలు కనిపిస్తాయి.
అయితే ఆత్మ ఎందుకు ఇలా ఆవహించింది. అసలు ఆ బిల్డింగులో గతంలో ఏం జరిగింది. ఇవన్నీ కూడా సుశాంత్ తెలుసుకుంటాడు. ఇక క్లైమాక్స్‌లో సుశాంత్ ఆత్మకు న్యాయం చేయడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. మరి చివరకు ఏం జరిగింది అనేది ఓటీటీలో ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా పేరు గార్డ్ రివెంజ్ ఫర్ లవ్..ఈ సినిమాలో నిజామాబాద్ కు చెందిన విరాజ్ రెడ్డి ఇందులో హీరోగా నటించాడు. అను ప్రొడక్షన్స్‌లో రూపొందింది ఈ సినిమా.ఈ చిత్రానికి జగ పెద్ది దర్శకత్వం వహించారు
ఇక ఈ సినిమా హీరో నిజామాబాద్ నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్నాడు అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఈ సినిమా కూడా అక్కడే షూట్ చేశారు. ఓ డిఫరెంట్ స్టోరీ అనే చెప్పాలి ఈ సినిమా.
అసలు గతంలో ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ హర్రర్ ఎలిమెంట్స్ తో దర్శకుడు తెరపై చూపించారు.ఈ మూవీ పూర్తిగా హీరోయిజం చూపించే పాత్ర కాదు.సినిమా ఆస్ట్రేలియాలో షూట్ చేయడం వల్ల అక్కడ సెక్యూరిటీ గార్డ్ జీవితాలు ఎలా ఉంటాయి అనేది మన నేటివిటికి దూరంగానే ఉంటుంది.
అక్కడ ప్లేవర్ సినిమా అయినా కథనం మన తెలుగుదే అనేది స్పష్టంగా తెరపై కనిపిస్తుంది.
మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ పాత్రలు చాలా బాగున్నాయి.ఈ సినిమా ఓటిటీలో మంచి వాచ్ అవర్స్ తో వెళుతోంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రైమ్ ద్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది