Wednesday, March 18, 2026
HomeNewsCinemaనాతో బ‌ల‌వంతంగా ఆ సీన్లు చేయించారు - హీరోయిన్ మోహిని

నాతో బ‌ల‌వంతంగా ఆ సీన్లు చేయించారు – హీరోయిన్ మోహిని

Published on

నటి మోహిని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు, అంతేకాదు స్టార్ హీరోల స‌ర‌స‌న సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించారు. ముఖ్యంగా బాల‌య్య బాబుతో ఆమె న‌టించిన ఆదిత్య 369 సినిమా ఆమె కెరియ‌ర్ లో ఓ సూప‌ర్ హిట్ చిత్రం. ఇక చిరంజీవి మోహ‌న్ బాబు ఇలా స్టార్ హీరోల సినిమాల్లో న‌టించారు. ఆమెకి తొలి సినిమా ఆదిత్య 369. ఇక సౌత్ లో అన్నీ భాష‌ల్లో ఆమె సినిమాలు చేశారు, అందంతో పాటు సినిమాల్లో అభిన‌యంతో ఆక‌ట్టుకున్నారు. మ‌ల‌యాళంలో ఆమె ఎక్కువ‌గా సినిమాలు చేశారు. ఈ స‌మ‌యంలో ఆమెకి వివాహం జ‌రిగింది.
ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టినా సినిమా చేశారు. త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు.

న‌టి మోహిని చాలాకాలం తర్వాత ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ స‌మ‌యంలో గ‌తంలో జ‌రిగిన విష‌యాలు సినిమా జ్ఞాపకాలను పంచుకుంది. దర్శకుడు ఆర్కే సెల్వమణి కన్మణి తమిళ సినిమాలో ఉడాల్‌ తళువా అనే పాట‌ని స్విమ్మింగ్ పూల్ లో ప్లాన్ చేశారు, అయితే ఆమెకి ఈత రాదు, స్విమ్ సూట్ వేసుకోవాలి త‌న‌కి చాలా అసౌక‌ర్యం అనిపించింద‌ట‌, ముందు తాను చేయ‌ను అని చెప్పి అంద‌రి ముందు ఏడ్చార‌ట‌. త‌న వ‌ల్ల కాదు అని బాధ‌ఫ‌డ్డార‌ట‌.

Also Read  హరిహర వీరమల్లు సినిమా నుంచి అందుకే తప్పుకున్నా - క్రిష్

అప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. కానీ చివ‌ర‌కు ఈ సాంగ్ ఇలా బ‌ల‌వంతంగా స‌గం దుస్తులు వేయించి సాంగ్ చేయించారు అని తెలిపింది. త‌ర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్‌ చేయాలన్నారు అప్పుడు నేను చేయ‌లేదు. అయితే నాకు ఇష్టం లేకుండా ఆ సీన్ చేశాను. మరీ గ్లామరస్‌గా కనిపించింది ఈ కన్మణి సినిమాలోనే అనే విష‌యాలు ఆమె తెలిపారు.

ఇక ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు త‌న‌కు దూరం అయ్యాయి అనే విష‌యం కూడా తెలిపారు మోహిని.
సూర్య సన్నాఫ్‌ కృష్ణన్ చిత్రంలో ముందు సిమ్రాన్ బ‌దులు ఆమెని సంప్ర‌దించారు. కానీ ఆమె సినిమాలు మానేశారు అని ఎవ‌రో డైర‌క్ట‌ర్ కి చెప్ప‌డంతో సిమ్రాన్ ని తీసుకున్నారు. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ ఒక‌సారి క‌లిసిన స‌మ‌యంలో ఈ విష‌యం చెప్పార‌ట‌.

Also Read  War 2 సినిమా ఈవెంట్లో Jr NTR మాట్లాడిన మాట‌ల‌కు నంద‌మూరి అభిమానులు..

రజనీకాంత్‌ ముత్తు సినిమాలో హీరోయిన్‌గా నన్ను తీసుకోవాలా? మీనాను తీసుకోవాలా అని దర్శక నిర్మాతలు ఆలోచ‌న‌లో ఉన్నారు. ఒక‌సారి క‌ల‌వ‌మ‌న్నారు నేను ఇలా ప‌ని కావాలి అని అడ‌గ‌డం ఇష్టం లేక సినిమా అవ‌కాశం వ‌దులుకున్నా ఫైనల్‌గా మీనాను సెలక్ట్‌ చేశారు. చిన్న తంబి కూడా నా డేట్స్ సెట్ కాక వ‌దులుకున్నా అని తెలిపింది. కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు ప‌డ్డాను నా భర్త కజిన్‌ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని తెలిపింది మోహిని.

ఆదిత్య 369 లో బాల‌య్య స‌ర‌స‌న న‌టించింది ఆమె.అలాగే చిరంజీవి చెల్లెలుగా హిట్ల‌ర్ సినిమాలో న‌టించింది.
మోహన్‌బాబు, మమ్ముట్టి, మోహన్‌లాల్ తో న‌టించారు. చెప్పాలంటే 1990లో కుర్రకారుకి డ్రీమ్ గర్ల్‌గా పేరు పొందింది ఈ అందాల భామ‌. మొత్తం సౌత్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అన్నీ భాష‌ల్లో 100కి పైగా చిత్రాల్లో నటించింది మోహిని. ఇక ఆమె చివ‌ర‌గా మ‌ల‌యాళ సినిమా సుర‌ష్ గోపీ హీరోగా వ‌చ్చిన కలెక్టర్ చిత్రంలో న‌టించింది. 2011లో ఈ సినిమా విడుద‌లైంది. త‌ర్వాత ఆమె సినిమాలు చేయ‌లేదు. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టి ఆమె సినిమాల్లో న‌టించాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read  అనుష్క డూప్ గా బాహుబ‌లి సినిమాలో న‌టించిన ఈమె ఎవ‌రో తెలుసా?

Latest articles

Tollywood: మరలా టాలీవుడ్‌‌కి తిరిగి వచ్చిన బండ్ల గణేష్..!

టాలీవుడ్‌లో నటుడు మరియు నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి...

Yellamma Cinema: అఫీషియల్‌ గ్లీంప్స్ ఏప్పుడంటే..?

బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా “యెల్లమ్మ” ను...

Chinmayi Sripadaకు షాకింగ్ బెదిరింపులు… న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన గాయని

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాడ తీవ్ర సైబర్ వేధింపుల బారిన పడ్డారు. కొందరు గుర్తు తెలియని...

Nagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో…

ప్రొడ్యూసర్ నాగ వంశీ టాలీవుడ్‌లో తెలియని వ్యక్తి కాదు.కానీ ఏమైందో ఏమో — 2025 సంవత్సరం నాగ వంశీకి...

Rashmika The Girlfriend: నాన్-థియేట్రికల్ రైట్స్ కి భారీ డీల్..

రష్మిక మందన్నా తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇంకా థియేటర్లలోకి రాకముందే బిజినెస్‌లో భారీ హడావిడి సృష్టిస్తోంది. సినిమా...

“LEO”కు ప్రీక్వెల్‌గా రాఘవ లారెన్స్ హీరోగావస్తున్న “Benz”..!

రాఘవ లారెన్స్ హీరోగా, నివిన్ పౌలి విలన్‌గా నటిస్తున్న తాజా చిత్రం “Benz” సినీ అభిమానుల్లో భారీ అంచనాలను...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...