ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు సంబంధించిన సేవలు, దర్శన టికెట్ల వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. ఇక నుంచి ఆలయంలోని అన్నీ సేవలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇప్పటి వరకు కౌంటర్ల దగ్గర నిలబడి టికెట్లు తీసుకునే విధానం ఉండేది. కానీ భక్తుల రద్దీ ఎక్కువ కావడం, క్యూలలో ఇబ్బందులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ఈవో(EO) తెలిపిన వివరాల ప్రకారం, ఇకపై దర్శనం, ప్రత్యేకసేవలు, ప్రసాదం టికెట్లు అన్నీ ఆన్‌లైన్లే లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆలయంలో ఇప్పటికే ఆన్‌లైన్& యాప్ బుక్ చేసిన ప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ముందుగానే బుకింగ్ చేసుకున్న భక్తులు ఎక్కువ సేపు వేచిచూడాల్సిన అవసరం లేకుండా త్వరగా ప్రసాదం తీసుకోవచ్చు.
ఈ కొత్త విధానం వల్ల
భక్తులకు సమయం ఆదా అవుతుంది.
ఆలయ ప్రాంగణంలో గందరగోళం తగ్గుతుంది.
పారదర్శకంగా టికెట్ల పంపిణీ జరుగుతుంది.
అలాగే, భక్తులు ఆలయానికి వచ్చే ముందు నుంచే తమ దర్శన టైమ్, సేవల వివరాలు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, శుక్రవారాలు, సెలవుల సమయంలో ఈ ఆన్‌లైన్ విధానం చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి, భక్తుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ యాజమాన్యం స్పష్టం చేసింది.